E-Paper
Advertisement

Darshan: రేణుకా స్వామి కుటుంబంతో దర్శన్ డీల్.. ఒప్పుకుంటారా..?

Darshan: రేణుకా స్వామి కుటుంబంతో దర్శన్ డీల్.. ఒప్పుకుంటారా..?
Advertisement

Darshan.. కన్నడ హీరో దర్శన్ (Darshan ) ఇప్పుడైతే హత్య కేసులో ఇరుక్కొని అందరి చేత విమర్శలు ఎదుర్కొంటున్నారు కానీ ఈ హత్య జరగకముందు ఆయనను కర్ణుడు అని అందరూ అభివర్ణించేవారు. అడిగిన వారికి లేదనకుండా కోట్ల రూపాయలను దానం చేసిన గొప్ప హృదయశీలి. ముఖ్యంగా అవసరం అని ఇంటికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా వట్టి చేతులతో పంపించిన దాఖలాలు లేవు. అలాంటి ఆయన ఇప్పుడు హత్య కేసులో ఇరుక్కొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమ్మాయి మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకోవడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే దర్శన్ రేణుకా స్వామి (Renuka swamy) హత్య కేసులో A2 నిందితుడిగా చేర్చబడిన విషయం తెలిసిందే.

రేణుకా స్వామి కుటుంబంతో డీల్..

Advertisement

కుటుంబానికి అండగా ఉంటాడని, తమను జీవితాంతం చూసుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు శోకమే మిగిలింది. అయితే ఇప్పుడు రేణుకా స్వామి లేని లోటును పూరిస్తూ..ఆ తల్లిదండ్రులకు అండగా నిలవడానికి ప్రతినెల 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డీల్ కుదుర్చుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రేణుకా స్వామి కుటుంబానికి అండగా దర్శన్..

Advertisement

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ హీరో దర్శన్ పరప్పన జైలు నుంచి బళ్లారి జైలుకు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.రేణుక స్వామి హత్య కేసులో దర్శన్ హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చినా ఇందులో ఆయన పాత్ర లేదు అనేది వాస్తవం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో దర్శన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేణుకా స్వామి కుటుంబానికి ప్రతి నెల 10 లక్షల రూపాయలు ఇవ్వాలని దర్శన్ ఆలోచించినట్లు సమాచారం. అంతేకాదు ఈ విషయాన్ని దర్శన్ కుటుంబ సభ్యులకు కూడా అంగీకరించి ఇప్పుడు ప్రతినెల రేణుక స్వామి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని దానికి అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జైలు నుంచి రాగానే వారి కుటుంబాన్ని కలవనున్న దర్శన్..

ఈ మేరకు దర్శన్ బళ్లారి జైల్లో.. తన కుటుంబ సభ్యులతో మాట్లాడారని, బళ్లారి జైలు నుంచి బయటకు రాగానే రేణుక స్వామి ఇంటికి నేరుగా వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో ఈ విషయంపై డీల్ కుదుర్చుకుంటారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అటు దర్శన్ కుటుంబం కానీ,ఇటు దర్శన్ కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ విషయాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ మంగళవారం బయటకు రావడంపై కూడా చర్చ జరుగుతుంది. మంగళవారం రోజు ఆయన జైలు నుంచి విడుదలవుతారని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన కొంతమంది నెటిజెన్స్.. అరబ్ దేశాలలో మాత్రమే..డబ్బులిస్తే సెటిల్ అయ్యే రూల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అలా కాదు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. రూల్స్ ఒప్పుకోవు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నెలకు రూ.10 లక్షల అంటే ఇక వారికేం కావాలి అంటుండగా.. మరికొంతమంది కన్న కొడుకుని కోల్పోయాక ఎంత డబ్బు ఇస్తే ఏం లాభం అంటూ ఇలా ఎవరికి తోచినట్టు వారు కామెంట్లు చేస్తున్నారు. ఇక దీనిపై పూర్తి అధికారిక క్లారిటీ వెలువడాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×