E-Paper
Advertisement

Dasara: 16 సెన్సార్ కట్స్.. 2.39 గంటల సినిమా.. ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటే..

Dasara: 16 సెన్సార్ కట్స్.. 2.39 గంటల సినిమా.. ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటే..
Advertisement

Dasara: దసరా. మోస్ట్ అవెయిటెడ్ మూవీ. పాటలు, ట్రైలర్ పిచ్చెక్కిస్తున్నాయి. నాని ఊరమాస్ గెటప్, స్లాంగ్, యాక్షన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. కీర్తి సురేశ్ మాస్ లుక్‌లో అదిరిపోయింది. పక్కా తెలంగాణ యాస. పదునైన భాష. మ్యూజిక్ కిరాక్ లేపుతోంది. సినిమా ఎప్పుడొప్పుడు చూసేద్దామా అనే ఉత్సాహం కలుగుతోంది. నాని నటనా విశ్వరూపం చూడాలంటే.. దసరా రావాలంటే.. మార్చి 30 వరకు ఆగాల్సిందే. పాన్ ఇండియా మూవీ కావడంతో దసరాపై అంచనాలు హైరేంజ్‌లో ఉన్నాయి.

లేటెస్ట్‌గా దసరా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. UA సర్టిఫికెట్‌ ఇచ్చినా.. సెన్సార్ సభ్యులు కత్తెరకు బాగానే పని చెప్పారు. సబ్‌టైటిల్స్‌తో సహా అసభ్యకర సంభాషణలను ‘మ్యూట్‌’ చేయాలని నిర్దేశించారు. వైలెన్స్‌ అధికంగా ఉన్న సన్నివేశాలను CGతో కవర్‌ చేయాలని సూచించారు. డిస్‌క్లైమర్‌లో వేసిన ‘ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ టెక్ట్స్‌ ఫాంట్ సైజ్‌ పెంచాలని చెప్పారు. మొత్తంగా 16 కట్స్‌ చెప్పింది సెన్సార్ బోర్డ్. అన్ని కట్స్ తర్వాత కూడా సినిమా నిడివి 2 గంటల 39 నిమిషాలు వచ్చింది.

Advertisement

అయితే, భారీగా సెన్సార్ కట్స్ చెప్పడంపై నాని అభిమానులు మండిపడుతున్నారు. సెన్సార్ సభ్యుల్లో అసలు తెలంగాణ వాళ్లు ఉన్నారా? వారికి ఆ భాష అసలు అర్థమై ఉంటుందా? తెలంగాణ భాష కాబట్టే అన్ని కట్స్ చేప్పారా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్మేస్తున్నారు.

సింగరేణి మైన్స్ సమీపంలో ఉండే వీర్లపల్లి గ్రామం నేపథ్యంలో దసరా తెరకెక్కింది. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. నానిని కంప్లీట్‌గా మేకోవర్ చేశాడు. పూర్తి గ్రామీణ నేపథ్యంలో, పక్కా మాస్ మసాలా మూవీగా దసరాను తీశారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్ అయ్యాయి. మార్చి 30నే థియేటర్లలో దసరా పండుగు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×