E-Paper
Advertisement

Devara 2 : దేవర పార్ట్ 2 తెరకెక్కితే ఇవి తెలియాలి

Devara 2 : దేవర పార్ట్ 2 తెరకెక్కితే ఇవి తెలియాలి
Advertisement

Devara 2 : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ పాన్ ఇండియా సినిమాల సీక్వెల్స్ కూడా నిర్మితమవుతున్నాయి. కొన్ని సినిమాలకు స్కోప్ లేకపోయినా కూడా కావాలనే సీక్వెల్ ని క్రియేట్ చేసే పనిలో పడ్డారు దర్శకులు. ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాలకి స్కోప్ లేకుండానే సీక్వెల్ చేయడానికి కొన్ని సీన్స్ ను క్రియేట్ చేశారు. ఒకప్పుడు కథను కేవలం మూడు గంటల్లోనే చెప్పేసి ప్రేక్షకుడిని శుభం కార్డుతో ఇంటికి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా సినిమా కొంత చూపించి మరో పార్ట్ కోసం దాదాపు రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేయండి. అంటూ సీరియల్ కల్చర్ ని అలవాటు చేసారు.

అయితే సీక్వెల్ అనేది వర్కౌట్ అవుతుంది. కానీ ఆ సీక్వెల్ కోసం వెయిట్ చేసేంత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసినప్పుడే ఆ సీక్వెల్ వర్త్ అనిపిస్తుంది. బాహుబలి విషయంలో అదే జరిగింది. బాహుబలి సినిమాకు విపరీతంగా కనెక్ట్ అయిన ఆడియన్స్ అంతా కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని వేచి చూడటానికి సంవత్సరాలు పాటు ఎదురు చూసారు. అది రాజమౌళి సినిమాను తెరకెక్కించిన గొప్పతనం అని చెప్పాలి. సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా ఉండేలా ఆ సినిమాను డిజైన్ చేశాడు జక్కన్న. అలానే ప్రస్తుతం కొన్ని సీక్వెల్ సినిమాల్లో కూడా ఏం జరగబోతుంది అనే అంశాలను మామూలుగా ఉంచారు తప్ప, అంత క్యూరియాసిటీని మాత్రం క్రియేట్ చేయలేకపోయారని చెప్పాలి.

Advertisement

ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర సినిమాను కూడా షూటింగ్ టైం లోనే రెండు పార్ట్స్ గా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక మొదటి పార్ట్ ప్రేక్షకులు ముందుకు వచ్చి మిక్సిడ్ టాక్ తో కొనసాగుతుంది. ఒక రెండు మూడు రోజుల్లో ఈ సినిమా ఫలితం ఏంటో ప్రేక్షకులు పూర్తిస్థాయిలో నిర్ణయిస్తారు. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి ఏముంది అంటూ చర్చించడం మొదలుపెట్టారు.

ఈ సినిమా సీక్వెల్ విషయానికి వస్తే

Advertisement

దయా మరియు యేటి ఎవరు? మురగన్ ఎలా చనిపోయాడు?
డీఎస్పీ తులసికి గాయాలు? నీటి అడుగున అస్థిపంజరాలు ఎవరివి..? ప్రకాష్ రాజ్ క్యారెక్టర్!! మద్యం మత్తులో అందరినీ చంపిన బలమైన దేవర.. ఎవరి చేతిలో చంపబడ్డాడు?ఇలా చాలా అంశాలు పార్ట్ 2 లో చూపించాల్సి ఉన్నాయి. దేవర సినిమా యాక్షన్ సీక్వెన్సెస్ ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఎవరికి కూడా ఈ సినిమాలోని కథాంశం, క్యారెక్టర్స్ పూర్తిస్థాయిలో ఎక్కలేదు. సినిమా కథను ఫాలో అయ్యి సినిమాను చూసిన ప్రేక్షకుడికి మాత్రం కొన్ని అంశాల్లో ఇంకా సందేహాలు ఇలానే మిగిలిపోయాయి. వీటన్నిటికీ కొరటాల శివ పార్ట్ 2 లో జస్టిఫై చేసే అవకాశం ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×