BigTV English

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Devara Run Time : దూకే ధైర్యమా జాగ్రత్త.. ధైర్యానికే కేరాఫ్ అడ్రస్ గా మారిన దేవరకు ఇప్పుడు ఆ ధైర్యం కోల్పోయి భయం పట్టుకుందేమో అన్నట్టుగా.. తాజాగా సెన్సార్ బోర్డ్ లాక్ చేసిన రన్ టైం చూస్తే అనిపిస్తుంది. ఇక రన్ టైం రోజు రోజుకీ తగ్గిస్తున్న నేపథ్యంలో అటు ఎన్టీఆర్ లో, ఇటు కొరటాల శివ లో కొత్త భయం చుట్టుకుందనే వార్తలు కూడా స్పష్టమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


దేవర రన్ టైమ్.. మళ్లీ కట్ చేశారుగా..

రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రం తర్వాత ఎన్టీఆర్ (NTR ) ఎంతో ప్రతిష్టాత్మకంగా దేవర (Devara) సినిమాలో నటిస్తున్నారు. మరొకవైపు ఆచార్య (Aacharya ) సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్న కొరటాల శివ (Koratala shiva) ఈసారి ఎలాగైనా సరే విజయం సాధించాలనే కసితో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రన్ టైం ని మరోసారి లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తగ్గించిన రన్ టైమ్ నిడివిని చూసి చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


2:32 గంటల వద్ద రన్ టైమ్ లాక్..

Devara Run Time : Fearless Devara has caught fear... Why did you cut so much?
Devara Run Time : Fearless Devara has caught fear… Why did you cut so much?

నిజానికి కొన్ని కొన్ని చిత్రాలు దాదాపు మూడు గంటల నిడివి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, అదే రన్ టైం కారణంగా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే..ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న చిత్ర బృందం ఈ సినిమా నిడివిని 2 గంటల 57 నిమిషాలకి కుదించారు. ఇందులో రెండు గంటల 52 నిమిషాలు సినిమా కాగా.. మిగిలిన 5 నిమిషాలు చివరి పాట, స్క్రోలింగ్ టైటిల్స్ కోసం ఉంచారు. అయితే విజయ్ ది గోట్ సినిమా విడుదలైన తర్వాత సినిమా 3:00 గంటల రన్ టైం తో రిలీజ్ అవడంతో, సినిమా రన్ టైం పై దారుణంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. వీటిని దృష్టిలో పెట్టుకొని 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీనిని మరింత తగ్గించి 2:32 నిమిషాలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. రెండు గంటల 32 నిమిషాలు అంటే కేవలం రెండున్నర గంట పాటు సాగే ఈ సినిమా అసలు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించగలదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

కీలక సన్నివేశాలన్నీ కట్ చేస్తే.. సినిమాలో ఏముంటుంది..

ముందు సినిమా రన్ టైం తగ్గించడం కోసం సినిమాలోని కామెడీ సన్నివేశాలను తొలగించడంతోపాటు.. ఎన్టీఆర్ – జాన్వి కపూర్ లవ్ ట్రాక్ లెంగ్త్ ను కూడా తగ్గించినట్లు వార్తలు వినిపించాయి. ఇటీవల విడుదల చేసిన దావూదీ సాంగు కూడా సినిమాలో ఉండదని , ఎండ్ టైటిల్స్ సమయంలో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసేలా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపించాయి.. ఇక ఇప్పుడు మళ్లీ సినిమాను కట్ చేసినట్లు వార్తలు రావడంతో ఇందులో చాలా కీలకమైన అంశాలను కూడా తగ్గించినట్లు సమాచారం. అసలు సిసలైన సన్నివేశాలను తగ్గిస్తే ఇక సినిమా ఏముంటుంది చూడడానికి అన్న రేంజ్ లో చిత్ర బృందం కూడా తెగ ఫీలైపోతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే రెండున్నర గంటలో సినిమాని లాక్ చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×