E-Paper
Advertisement

Devara Second Single: ఎవరిని మోసం చేస్తారు.. ఆ సాంగ్ ను కాపీ కొట్టి.. డిట్టో దింపేశారుగా

Devara Second Single: ఎవరిని మోసం చేస్తారు.. ఆ సాంగ్ ను కాపీ కొట్టి.. డిట్టో దింపేశారుగా
Advertisement

Devara Second Single: సోషల్ మీడియా వచ్చాకా కొత్తదనం అనే పదానికి అర్ధమే మారుతుంది. స్టార్ హీరోస్ కొత్త సినిమా పోస్టర్స్ నుంచి సినిమా రిలీజ్ అయ్యాకా అందులో వచ్చే సీన్స్ వరకు డైరెక్టర్ ఎంత కొత్తగా చూపించినా.. ఇది ఆ సినిమాలో నుంచి కొట్టేశారు. ఈ సినిమా నుంచి కొట్టేశారు. ఆ పోస్టర్ హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారు. ఈ సాంగ్.. ఆ ఆల్బమ్ నుంచి ఎత్తేశారు.. ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం. కేవలం అది మాటల్లో కూడా చెప్పకుండా ఏకంగా కాపీ కొట్టిన సీన్ ను, పోస్టర్ ను వెతికి మరీ రెండింటిని పక్కపక్కన పెట్టి మరీ పరువు తీస్తుంటారు.

ఇక ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే జరిగింది. ఎన్నో రోజుల నుంచి దేవర సెకండ్ సింగిల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు ఈరోజు ఆ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు అంటూ సాగినఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రామజోగయ్యశాస్త్రి రాసిన లిరిక్స్.. శిల్పారావు వాయిస్ అద్భుతమని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ – జాన్వీ రొమాన్స్ అదిరిపోయింది.

Advertisement

కోలీవుడ్ లో మ్యూజిక్ సెన్సేషన్ అనిపించుకున్న అనిరుధ్ .. దేవర ఫస్ట్ సాంగ్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. కానీ, సెకండ్ సాంగ్ కు మాత్రం దొరికిపోయాడు. ఈ సాంగ్ మూడేళ్ళ క్రితం యూట్యూబ్ లో ట్రెండ్ అయిన మానికే మాగే హితే కవర్ సాంగ్ విన్నట్టే ఉందని చెప్పుకొస్తున్నారు. అచ్చుగుద్దినట్లు అనిరుధ్ ఈ మ్యూజిక్ ను దించేశాడని చెప్పుకొస్తున్నారు.

అప్పట్లో ఒక శ్రీలంకన్ సింగర్ ఈ సాంగ్ తో బాగాఫేమస్ అయ్యింది. ఈ సాంగ్ ఇప్పుడు కూడా ఎక్కడ విన్నా టక్కున గుర్తుపడతారు. ఇక దేవర సాంగ్ ట్యూన్ కూడా అలానే ఉందని రా నీ నిద్దుర కులాసా.. నీ కలలకిచ్చేసా లాంటి ట్యూన్ మొత్తం సేమ్ డిట్టో ఉందని చెప్పుకొస్తున్నారు. ఎవరిని మోసం చేస్తారు.. ఆ సాంగ్ ను కాపీ కొట్టి.. డిట్టో దింపేశారుగా అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు ట్యూన్స్ ను పక్క పక్కనపెట్టి కాపీ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై అనిరుధ్ ఎలాస్పందిస్తాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×