E-Paper
Advertisement

Devi Sri Prasad: దేవిశ్రీ ఈజ్ బ్యాక్.. అరడజనకు పైగా సినిమాలతో ఫుల్ బిజీ

Devi Sri Prasad: దేవిశ్రీ ఈజ్ బ్యాక్.. అరడజనకు పైగా సినిమాలతో ఫుల్ బిజీ
Advertisement

Devi Sri Prasad: ప్రముఖ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఉప్పెన, పుష్ప వంటి సినిమాలలో తన సంగీతం అందించి ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా 8 సినిమాలు చేసినప్పటికీ ఒక్క హిట్టు కూడా పడలేదు. దీంతో దేవీశ్రీ పనైపోయింది అని అంతా అనుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మళ్లీ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. దేవీశ్రీ తిరిగి ఫాంలోకి రావడంతో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ వచ్చింది. అదే సమయంలో పుష్ప సినిమాతో ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకొని అందరి దృష్టిలో పడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఆయనకు చాలా అవకాశాలు వచ్చాయి. దీంతో అతడికి గత వైభవం వచ్చింది. ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు దేవిశ్రీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో ‘పుష్ప2’ ఒకటి. ఈ సినిమాతో పాటు ఇందులోని మ్యూజిక్‌పై కూడా అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఇప్పుడు దేవీశ్రీ చేతిలో ఉన్న సినిమాలేంటో చూసేద్దాం..

Advertisement

కోలీవుడ్ హీరో సూర్య కథానాయకుడిగా, శివ దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘కంగువ’. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.

పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.

Advertisement

అక్కినేని నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న ‘తండేల్’.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్ కలిసి చేస్తున్న ఓ పాన్ ఇండియా సినిమాకు కూడా దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్

విశాల్ కొత్త సినిమా ‘రత్నం’.

అజిత్ కుమార్ నెక్స్ట్ మూవీ ‘AK63’కి కూడా దేవీశ్రీనే మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఆయన చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. మరి ఈ చిత్రాలకు దేవిశ్రీ అందిస్తున్న సంగీతం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా? లేదా అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×