E-Paper
Advertisement

Imanvi: ప్రభాస్ సరసన ఇమాన్వినే ఎందుకు.. హను ఏమన్నాడంటే.. ?

Imanvi: ప్రభాస్ సరసన ఇమాన్వినే ఎందుకు.. హను ఏమన్నాడంటే.. ?
Advertisement

Imanvi: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా  ఒక జీవితాన్నే మార్చేస్తుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే హీరోయిన్స్ మొదటి సినిమా అయితే.. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఫేమస్ అయిపోతారు. మొన్నటివరకు భాగ్యశ్రీ బోర్సే మీద పడ్డ నెటిజన్స్ చూపు.. ఇప్పుడు ఇమాన్వి మీద పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన మొదటిసారి నటించే అవకాశాన్ని ఈ చిన్నది చేజిక్కించుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

ఇక ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమంలో ఇమాన్వి కనిపించింది. అలా కనిపించిందో లేదో.. ఇలా స్టార్ డమ్ అను అందుకుంది. అసలు ఎవరీమె అని ఫ్యాన్స్ ఆరాలు తీయడం కూడా మొదలుపెట్టారు. కొరియోగ్రాఫర్ అయిన ఇమాన్వి ఓల్డ్ వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెల్సిందే.  అయితే చాలామందికి.. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోయిన్లు ఉండగా.. ఇమాన్వినే హను  ఎలా సెలెక్ట్ చేశాడు అనే డౌట్ మొదలయ్యింది. దానికి సమాధానంగా హను.. ఇమాన్వి గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Advertisement

” ఇమాన్విని నేను కూడా సోషల్ మీడియాలోనే చూసాను. ఆమె డ్యాన్స్ లకు ఎట్రాక్ట్ అయ్యాను. ఇన్స్టా గ్రామ్ ద్వారానే ఇమాన్విని సంప్రదించాను. ఆడిషన్స్ కు రమ్మని చెప్పాము. 15 రోజులు స్క్రీన్ టెస్ట్ చేసి ప్రభాస్ కు చూపించాను. ప్రభాస్ కు ఇమాన్వి పర్ఫెక్ట్ గా క్యారెక్టర్ కు సరిపోతుందని చెప్పడంతో ఆమెను ఓకే చేసాం ” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ కు ఉన్న అనుమానాలు అని తీరిపోయాయి.

ప్రభాస్ సినిమా ఇంకా చేయనే లేదు ఒకే ఒక్కరోజులో ఇమాన్వి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపులో ఈ చిన్నదానికి మరిన్ని అవకాశాలు వెల్లువెత్తుతాయి అని చెప్పడంలో  ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇమాన్వి భవిష్యత్తు లో ఎలాంటి సినిమాలను ఎంచుకుంటుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×