E-Paper
Advertisement

Bahishkarana Teaser: ఈ ప్రపంచం లొంగిపోయేది రెండింటికే.. ఒకటి సొమ్ముకి.. రెండు సోకుకి..

Bahishkarana Teaser: ఈ ప్రపంచం లొంగిపోయేది రెండింటికే.. ఒకటి సొమ్ముకి.. రెండు సోకుకి..
Advertisement

Bahishkarana Teaser: అచ్చ తెలుగందం అంజలి ప్రస్తుతం ఒకపక్క సినిమాలు, ఇంకోపక్క వెబ్ సిరీస్ లు అంటూ బిజీగా మారింది. కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసే అంజలి ఈ మధ్యనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో వేశ్యగా నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అంజలికి మాత్రం మంచి పేరే వచ్చింది. ఇక తాజాగా అంజలి హీరోయిన్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్ బహిష్కరణ.

ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను పిక్సెస్ పిక్చర్స్ ఇండియా బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సిరీస్ లో కూడా అంజలి వేశ్యగానే కనిపిస్తోంది. అంజలి మాత్రమే కాకుండా ఈ సిరీస్ లో మరో ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసిన ఈ సిరీస్ కొన్ని కారణాల వలన విడుదలకు నోచుకోలేదు.

Advertisement

ఇక ఇప్పుడు ఈ సిరీస్.. జీ5 లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే బహిష్కరణ నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సిరీస్ టీజర్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపాడు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” ఈ ప్రపంచం లొంగిపోయేది రెండింటికే.. ఒకటి సొమ్ముకి.. రెండు సోకుకి” అనే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది.

కథ ఏంటి అనేది క్లారిటీగా చూపించలేదు కానీ.. ఎంతో అమాయకంగా ఉండే అంజలి.. ఒకపక్క సుఖాన్ని అందిస్తూ.. ఇంకోపక్క అతికిరాతకంగా వారిని చంపడం చూపించారు. అసలు అంజలి ఎందుకు వేశ్యగా మారింది.. ? ఎవరిని చంపుతుంది.. ? ఆమెను ఊరి నుంచి బహిష్కరించారా.. ? అనేది తెలియాలంటే సిరీస్ వచ్చేవరకు ఆగాల్సిందే. టీజర్ లోనే అంజలి నట విశ్వరూపం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సిరీస్ తో అంజలి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×