E-Paper
Advertisement

Prabhas – Maruti Raja Saab Movie: నేను ప్రభాస్‌కు ట్రూ లవర్‌: దర్శకుడు మారుతి

Prabhas – Maruti Raja Saab Movie: నేను ప్రభాస్‌కు ట్రూ లవర్‌: దర్శకుడు మారుతి
Advertisement

Prabhas Maruti Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఓ మూవీ నుంచి అప్డేట్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్‌ను ఆ చిత్ర దర్శకుడు చెప్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..? ఆయనతో ప్రభాస్ చేస్తోన్న సినిమా ఏంటి? అనే విషయానికొస్తే..

రెబల్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. ఎన్నో అంచనాల నడుమ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. ప్రభాస్‌ను తమ అభిమానులు ఏ రేంజ్‌లో చూడాలనుకున్నారో అదే రేంజ్‌లో సలార్ మూవీలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ లైనప్‌లో చాలా సినిమాలే ఉన్నా.. అతడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారని అంతా అనుకున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ దర్శకుడు మారుతితో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సలార్ మూవీలో ప్రభాస్‌ను మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో చూసిన అభిమానులు.. ఈ మూవీలో ఎలా ఉండబోతున్నాడో అని గుస గుసలాడుకుంటున్నారు. కాగా ఇటీవల మేకర్స్ ఈ మూవీ టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గానూ ‘రాజాసాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రభాస్ లుంగీ కట్టుకుని ఉన్న పోజ్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది.

రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తయితే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి దర్శకుడు మారుతి అదిరే అప్డేట్ అందించారు.

Advertisement

తాజాగా ‘ట్రూ లవర్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మారుతి.. ప్రభాస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ తెలిపారు. ఈ మేరకు తాను ప్రభాస్‌కు ట్రూ లవర్‌ని అంటూ చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రేమని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభాస్ అంటే తనకు ఎంత ఇష్టమో ‘రాజా సాబ్’ మూవీలో చూస్తారంటూ చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ లైనప్‌లో ఈ సినిమాతో పాటు ‘కల్కి’ మూవీలో నటిస్తున్నాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×