BigTV English

Tollywood Director: ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ డైరెక్టర్ ను గుర్తుపట్టండి చూద్దాం..

Tollywood Director: ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ డైరెక్టర్ ను గుర్తుపట్టండి చూద్దాం..

Tollywood Director: అతనొక స్టార్ డైరెక్టర్.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లుడు.. ఈ ఏడాది ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాకు డైరెక్టర్.. అయినా ఎప్పుడు సింపుల్ గా కనిపిస్తాడు. పొడుగైన జుట్టు, గడ్డంతో ఒక స్వామీజీ లా దర్శనమిస్తాడు. కానీ, ఇప్పుడు ఇదుగో ఇలా గుండుతో ప్రత్యక్షమయ్యి అందరికి షాక్ ఇచ్చాడు. ఏది ఈ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టండి అని అంటే..ఇక ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాకా గుర్తుపట్టలేకపోతే.. అసలు మేము సినిమా లవర్స్ కాము అంటారా.. ? అవును.. మీరు గెస్ చేసింది కరెక్ట్. గుండుతో.. సింపుల్ లుక్ లుక్ లో కనిపిస్తున్న ఈ డైరెక్టర్.. మన నాగ్ అశ్విన్.


ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి2898 AD. ఈ సినిమా జూన్ 27 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి రికార్డులు సృష్టించింది. అసలు కల్కి సినిమా తరువాత ఇండస్ట్రీ మొత్తం నాగీ ఐడియాలజీకి దండం పెట్టింది. ఒక సైన్స్ ఫికేషన్ కథకు పౌరాణికాన్ని జతచేసి అద్భుతమైన కళాఖండాన్ని తెరకెక్కించిన నాగీని ప్రశంసించని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు.

అసలు.. పరీక్షల ముందు కూడా పుస్తకాలు ముట్టని యువత చేత.. భగవద్గీత చదివించిన ఘనత నాగీదే అని చెప్పాలి. ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లు అహర్నిశలు కష్టపడ్డాడు. ఇక సినిమా విజయం సాధించడంతో పాటు తన కష్టానికి ప్రతిఫలం దక్కడంతో.. నాగీ మొక్కులు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది.


అరుణాచలేశ్వర ఆలయాన్ని సందర్శించిన నాగ్ అశ్విన్.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించాడు. తలనీలాలు సమర్పించి.. స్వామివారి ఆశీస్సులు అందుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక సడెన్ గా గుండుతో నాగీ కనిపించడంతో.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కొంతమంది అయితే అసలు గుర్తుపట్టడం లేదు కూడా. ఇంకొంతమంది అయితే ఎలా ఉండేవాడు.. ఎలా మారాడు.. ? అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక కల్కి తరువాత దానికి సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఆ సినిమా రిలీజ్ కు మళ్లీ అంతే జుట్టు వస్తుందిలే అన్నా అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి కల్కి 2 ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×