E-Paper
Advertisement

Kalki 2898AD: కల్కిలో కృష్ణుడిగా నటించింది ఎవరో తెలుసా.. అతను మీకు కూడా సుపరిచితుడే.. ?

Kalki 2898AD: కల్కిలో కృష్ణుడిగా నటించింది ఎవరో తెలుసా.. అతను మీకు కూడా సుపరిచితుడే.. ?
Advertisement

Kalki 2898AD: బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ సినిమా తరువాత అతని రేంజ్ కూడా మారింది. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన ఏ చిత్రమైన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. సినిమాలు రిలీజ్ అవ్వడం వేరు.. హిట్స్ అందుకోవడం వేరు. బాహుబలి 2 తరువాత ప్రభాస్.. రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్, సలార్ లాంటి సినిమాల్లో నటించాడు. ఈ సినిమాలు కలక్షన్స్ రాబట్టాయేమో కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయాయి.

ఎప్పటినుంచో ప్రభాస్.. బాహుబలి లాంటి హిట్ ను అందుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కల్కితో ఆ ఆ హిట్ ను అందుకున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ 30 నిమిషాలు థియేటర్ లో ఏ ప్రేక్షకుడు చూపు కూడా తిప్పలేదు అంటే అతిశయోక్తి కాదు.

Advertisement

కురుక్షేత్ర యుద్ధంలో ఒకపక్క అర్జునుడు.. ఇంకోపక్క అశ్వత్థామ. అర్జునుడు రథసారధిగా కృష్ణుడు. ఇక అశ్వత్థామపై చివరి బాణం గురిపెట్టే సమయానికి ఆయనకు తోడుగా నేనున్నా అంటూ వచ్చే కర్ణుడు ఎంట్రీ.. అబ్బబ్బ చూడడానికి రెండు కళ్లు సరిపోవు. ఇక కర్ణుడు గురించి, అతని పరాక్రమం గురించి, అతని బలం గురించి అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించే విధానం అద్భుతం.

అయితే అందరి ముఖాలు చూపించారు కానీ, శ్రీకృష్ణుడు ముఖాన్ని మాత్రం మేకర్స్ దాచేశారు. కేవలం బాడీ మాత్రమే కనిపిస్తుండడంతో.. ఆ పాత్రలో నటించింది హీరో నాని అని కొందరు అనుకుంటున్నారు. అయితే శ్రీకృష్ణుడు పాత్రలో నటించింది మన తెలుగు హీరో కాదు.. తమిళ నటుడు కెకె. అతని పూర్తి పేరు కృష్ణ కుమార్. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా గుర్తుంది కదా.. అందులో సూర్య ఫ్రెండ్ కెప్టెన్ చీ అనే పాత్రలో నటించాడు. ఈ సినిమా అతనికి మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది.

Advertisement

ఇక మధ్యలో పలు సినిమాలు చేస్తూ మెప్పించిన కృష్ణ కుమార్.. కల్కిలో శ్రీకృష్ణుడుగా కనిపించాడు. ఆ బాడీ లాంగ్వేజ్ తోనే అందరి మనసులను ఆకట్టుకున్నాడు. కల్కిలో శ్రీకృష్ణుడు పాత్రలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, అది గర్వంగా ఫీల్ అవుతున్నట్లు కెకె చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కెకె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి నెక్స్ట్ పార్ట్ లో కెకె ఫేస్ రివీల్ చేస్తారో.. లేక వేరే హీరోను పెడతారో చూడాలి.

https://twitter.com/vinays369/status/1806274708939456589?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×