E-Paper
Advertisement

Dunki Vs Salaar | బాలీవుడ్ బాద్షాకు ప్రశాంత్ నీల్ గండం.. దెబ్బ మీద దెబ్బ!

Dunki Vs Salaar | బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు రెండోసారి కన్నడ డైరెక్టర్ దెబ్బ కొట్టాడు. అసలే పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ఊపు మీద ఉన్న షారుఖ్ ఖాన్‌.. డంకీ చిత్రంతో ఈజీగా హ్యాట్రిక్ సాధిస్తాడని అందరూ అనుకుంటున్న సమయంలో సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ గట్టి దెబ్బే కొట్టింది.

Dunki Vs Salaar | బాలీవుడ్ బాద్షాకు ప్రశాంత్ నీల్ గండం.. దెబ్బ మీద దెబ్బ!
Advertisement

Dunki Vs Salaar | బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు రెండోసారి కన్నడ డైరెక్టర్ దెబ్బ కొట్టాడు. అసలే పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ఊపు మీద ఉన్న షారుఖ్ ఖాన్‌.. డంకీ చిత్రంతో ఈజీగా హ్యాట్రిక్ సాధిస్తాడని అందరూ అనుకుంటున్న సమయంలో సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ గట్టి దెబ్బే కొట్టింది.

సలార్ దెబ్బకు డంకీ పూర్తిగా కుదేలైంది. ఒకవైపు సలార్.. డంకీ కంటే ఒకరోజు తరువాత విడుదలైనప్పటికీ హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకుపోతోంది. మరోవైపు అపజయమే ఎరుగని హిందీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన డంకీకి మాత్రం సినిమా ప్రియుల నుంచి ఆదరణ ఆశించిన స్థాయిలో లభించడం లేదు. నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సలార్ రూ.400 కోట్లకు పైగానే కలెక్షన్ రాబట్టిందని సమాచారం. కానీ డంకీ మాత్రం అయిదు రోజుల్లో రూ.150 కోట్ల లోపే ఉంది. అయితే తక్కువ ఖర్చుతో డంకీ నిర్మాణం జరిగింది కాబట్టి.. సినిమా స్వల్ప లాభాలతో గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement

షారుఖ్ ఖాన్ నటించిన సినిమా విడుదల సమయంలోనే దక్షిణాది దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా విడుదల కావడం ఇదే రెండోసారి. అంతకు ముందు కూడా ప్రశాంత్ నీల్ సినిమానే పైచేయి సాధించింది.

2018 సంవత్సరంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజిఎఫ్ రిలీజ్ అయింది. అదే సమయానికి షారుఖ్ ఖాన్, అనుష్క నటించిన జీరో విడుదల అయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్‌కు దేశమంతా ఆదరణ లభించింది. వసూళ్లలో రికార్డులు సృష్టించిందా సినిమా. కానీ అప్పుడు బాలీవుడ్ బాద్షాకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుసగా ఫ్లాపులు అతని వెంట పడుతున్నాయి. అందుకే షారుఖ్ ప్రయోగాలు చేశాడు. జీరో సినిమాలో మరుగుజ్జు వ్యక్తి పాత్రని పోషించాడు.

Advertisement

మరోవైపు కేజీఎఫ్‌లో కన్నడ హీరో యష్ ముంబై నుంచి వచ్చి కోలార్ బంగారు గనులు ఆక్రమించుకొనే ఒక మాఫియా డాన్ పాత్రని పోషించాడు. దీనికి తోడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో మాస్ ఎలివేషన్లతో సినీఅభిమానులను కట్టిపడేశాడు. ఈ పోటీలో కేజీఎఫ్ ముందు షారుఖ్ నటించిన జీరో తేలిపోయింది. కట్ చేస్తే అయిదేళ్ల తరువా మళ్లీ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాకి పోటీగా ప్రశాంత్ దర్శకత్వం వహించిన సలార్ వచ్చింది. ఈ సారి కూడా విజయం ప్రశాంత్ నీల్‌కే దక్కిందని చెప్పాలి.

Dunki Vs Salaar, Prashant Neel, beat, ShahRukh khan, KGF, Zero Movie, Actor Yash, Prabhas,

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×