E-Paper
Advertisement

Emraan Hashmi: బ్రేకింగ్.. షూటింగ్ లో గాయాల పాలైన ఓజీ విలన్

Emraan Hashmi: బ్రేకింగ్.. షూటింగ్ లో గాయాల పాలైన ఓజీ విలన్
Advertisement

Emraan Hashmi: బాలీవుడ్  రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా కూడా.. అతని సినిమాలకు తెలుగులో కూడా సపరేట్ ఫ్యాన్  బేస్ ఉందనే చెప్పాలి. ఇమ్రాన్  హష్మీ సినిమాలు అంటే కచ్చితంగా హీరోయిన్స్ తో లిప్ కిస్ ఉండాల్సిందే. అందుకే ఆయనను సీరియల్ కిస్సర్ అంటారు. ఇక బాలీవుడ్ నుంచి ఈ రొమాంటిక్ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాతో ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కు ధీటైన విలనిజాన్ని చూపించబోతున్నాడు. పవన్ రాజకీయాల్లోకి వెళ్ళాక OG షూటింగ్ ఆగిన విషయం తెల్సిందే. త్వరలోనే ఈ షూటింగ్ మళ్లీ మొదలుకానుంది. ఈలోపు ఇమ్రాన్ హష్మీ.. మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  అదే గూఢచారి 2.

Advertisement

అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి  వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. 2018 లో అడివి శేష్ నటించిన  గూఢచారి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్ లో ఇమ్రాన్ హష్మీ గాయపడ్డాడు.

హైదరాబాద్ లో వేసిన సెట్ లో మెగా యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్న నేపథ్యంలో డూప్ లేకుండా  ఇమ్రాన్ హష్మీ పాల్గొనడంతో.. అతనికి గాయాలు అయ్యాయని తెలుస్తోంది. మెడకు తీవ్ర గాయం కావడం వెంటనే చిత్ర యూనిట్ ఇమ్రాన్ ను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వచ్చే ఏడాది గూఢచారి 2 సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ రెండు సినిమాలతో సీరియల్ కిస్సర్.. సీరియస్ విలన్ గా మంచి విజయాలను అందుకుంటాడేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×