BigTV English

Fahadh Faasil: 100 కోట్ల హీరో అని చెప్పండ్రా ఈయనకు.. మరీ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు

Fahadh Faasil: 100 కోట్ల హీరో అని చెప్పండ్రా ఈయనకు.. మరీ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు

Fahadh Faasil: ఇండస్ట్రీలో ఎవరికైనా హీరో అనిపించుకోవడం కంటే.. నటుడు అని అనిపించుకోవడమే గర్వంగా ఉంటుంది. హీరో అంటే కేవలం ఒక పాత్ర వరకే పరిమితం. అదే నటుడు అంటే.. ఎలాంటి పాత్రలోనైనా  ఒదిగిపోగలడు అని చెప్పొచ్చు.  చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. కానీ, నటులు అని చెప్పుకోదగ్గవారు చాలా తక్కువమంది ఉన్నారు. అలా చెప్పుకోదగ్గ నటుల్లో  మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఒకరు.


మలయాళ డైరెక్టర్ ఫాజిల్  నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఫహద్. కెరీర్ మొదట్లో అతడికి అవమానాలే దక్కాయి.  డైరెక్టర్ కొడుకా.. ఇతను హీరోనా.. ?  ఇలా ఉన్నాడేంటి.. ? ఇలా  ఎన్నో అవమానాలను దాటుకొని వైవిధ్యమైన కథలను ఎంచుకొని..  స్టార్ గా.. సూపర్ స్టార్ గా ఫహద్ ఎదిగిన తీరు ఎంతో ప్రశంసనీయం.  ఒక రెండు హిట్స్ పడగానే నేను కేవలం హీరో పాత్రలే చేస్తాను అని పొగరుగా చెప్పే హీరోలు ఉన్న  ఇండస్ట్రీలో.. కథ నచ్చితే.. తన పాత్ర నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ అయినా ఫహద్ చేసేస్తాడు.

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, క్యామియో గా, కమెడియన్ గా.. ఇలా  ఏదైనా సరే ఈ హీరో దిగనంత వరకే.  ఒక్కసారి సెట్ లోకి అడుగుపెడితే.. మిగతా హీరోలు ఎంతమంది అయినా ఉండనీ.. ఫహద్ ఉన్నంతసేపు తన నటనతో మిగతావారెవ్వరిని గుర్తురానివ్వకుండా చేయగలడు.  ఒక సూపర్ డీలక్స్, ఒక పుష్ప,  ఒక విక్రమ్, ఒక ఆవేశం..  ఈ సినిమాలలో ఫహద్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు. ఇక ఆవేశం సినిమాతో.. రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు.


ఇక ఆవేశం తరువాత ఫహద్ నటించిన చిత్రం వెట్టయాన్. రజినీకాంత్ హీరోగా నటించిన  ఈ చిత్రంలో ఫహద్ ఒక కీలక పాత్రలో నటించాడు. ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇందులో స్టార్ క్యాస్టింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరి కంటే.. ఫహద్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. బ్యాటరీ అనే పాత్రలో ఈ  మలయాళ హీరో ఒదిగిపోయాడు. దొంగ నుంచి రజినీకి టెక్నీకల్ గా హెల్ప్ చేసే పాత్రలో  ఫహద్ అదరగొట్టాడు. మధ్యమధ్యలో కామెడీ, స్టైల్ వేరే లెవెల్ అని చెప్పాలి. అయితే సినిమా మొత్తంలో 15 నిముషాలు కనిపించినా .. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. రజినీ తరువాత హీరో అంటే ఫహద్ అనే చెప్పాలి.

ఇక ఫహద్ ను వెట్టయాన్ లో చూసిన అభిమానులు మాత్రం.. ఇక ఇలాంటి సైడ్ క్యారెక్టర్స్ ఆపేయ్ అన్నా.. హీరోగా నీకు చాలా మంచి కెరీర్ ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే.. 100 కోట్ల హీరో అని చెప్పండ్రా ఈయనకు.. మరీ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఫహద్.. పుష్ప 2 లో విలన్ గా చేస్తున్నాడు. పుష్ప లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో పార్టీ లేదా పుష్ప  అనే ఒక్క డైలాగ్ తో పాన్ ఇండియా రేంజ్ ను అందుకున్న ఫహద్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో  మరింత వైల్డ్ గా కనిపించబోతున్నాడట. మరి ఈ సినిమాతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×