E-Paper
Advertisement

Venu Swamy: బిగ్ బాస్ లోకి వేణుస్వామి.. ఎవరి జాతకాలను మారుద్దామనో.. ?

Venu Swamy: బిగ్ బాస్ లోకి వేణుస్వామి.. ఎవరి జాతకాలను మారుద్దామనో.. ?
Advertisement

Venu Swamy: బిగ్ బాస్ సీజన్ 8 మొదలుకానున్న విషయం తెల్సిందే. ఇక సీజన్ 7 బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో.. ఈసారి సీజన్ 8 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే సీజన్ 8 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో పేర్లు కూడా వైరల్ గా మారాయి. వారిలో యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ సోనియా సింగ్, నటి హేమ, ఫార్మింగ్ నేత్ర, నేత్ర మాజీ భర్త వంశీ, రీతూ చౌదరి, సురేఖావాణి లేదా ఆమె కూతురు సుప్రీత, కిరాక్ ఆర్పీ, కుమారి ఆంటీ, బర్రెలక్క, హీరోయిన్ కుషిత కల్లపు, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ వచ్చే అవకాశం ఉందట.

అలాగే నీతోనే డాన్స్ 2.0 పాల్గొన్న ఒక జంట, లేదా జంటలో ఒకరు రావచ్చట.అంజలీ పావని, యాంకర్ శివ, నయని పావని, యాంకర్ స్రవంతి చొక్కారపు, మాస్టర్ చెఫ్ సంజయ్, రైతుబడి రాజేంద్రరెడ్డి, ప్రసాద్ టెక్ ఇన్ యూట్యూబర్, ఫారిన్ లో సెటిలైన వ్లాగర్స్ లో ఒకరు ఉండనున్నారని టాక్ నడుస్తోంది. ఇక ఈ మధ్యనే బ్రహ్మముడి కావ్య కూడా హౌస్ లోకి వెళ్లబోతుందని వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని ఆమె చెప్పడంతో వాటికి ఫుల్ స్టాప్ పడింది.

Advertisement

ఇక తాజాగా హౌస్ లోకి ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి వెళ్తున్నాడని వార్తలు వైరల్ గా మారాయి. వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే వేణుస్వామి.. ఎన్నో వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. ఎన్నికల ముందు వైసీపీ గెలుస్తుందని చెప్పిన ఆయన.. ఆ తరువాత కూటమి గెలవడంతో అభిమానులకు క్షమాపణలు చెప్పి.. ఇకనుంచి రాజకీయాల గురించి జ్యోతిష్యం చెప్పను అని క్షమాపణలు కోరాడు.

వేణుస్వామి పాపులారిటీ చూసి బిగ్ బాస్ యాజమాన్యం.. హౌస్ లోకి రప్పిస్తుందంట. అది కూడా ఎక్కువ పారితోషికం ఇచ్చి మరీ రమ్మన్నారని టాక్. కంటెస్టెంట్స్ అందరిలో వేణుస్వామికే ఎక్కువ మనీ ఇవ్వనున్నారట. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు వేణుస్వామిపై కౌంటర్లు వేస్తున్నారు. హౌస్ లో ఎవరి జాతకాలు మారుద్దామని వెళ్తున్నావ్.. ? అని కొందరు. నాగ్ తిట్టేటప్పుడు నీ జాతకం బాలేదు.. పూజ చేయాలి లాంటివి చెప్పకు.. వెంటనే బయటకు గెంటేస్తాడు అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×