E-Paper
Advertisement

Fauji Movie : భారీ ధరకు ‘ ఫౌజీ ‘ డిజిటల్ రైట్స్.. ఇది ప్రభాస్ రేంజ్.. !

Fauji Movie :  భారీ ధరకు ‘ ఫౌజీ ‘ డిజిటల్ రైట్స్.. ఇది ప్రభాస్ రేంజ్.. !
Advertisement

Fauji Movie : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది కల్కి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత హను రాఘపూడి దర్శకత్వంలో పౌజీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అప్పటి నుంచే ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీ భారీ ధరకు ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసింది.. ఆ వివరాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సినిమా ప్రేమ కథతో తెరకెక్కబోతుంది. వరల్డ్ వార్ నేపథ్యంతో సాగే స్వచ్చమైన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ హక్కుల కోసం ఇప్పటి నుంచే తీవ్ర స్థాయిలో పోటీ కనిపిస్తోందని తెలిసింది.. ప్రభాస్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఎక్స్పేక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. ఈ సినిమాకు కూడా అంతకు మించి ఉంటాయాన్ని అందరు అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు కుదుర్చుకుందని సమాచారం.. ఈ క్రమంలోనే తాజాగా ఓ బడా కంపెనీ వీటిని సొంతం చేసుకుందని న్యూస్ లీకైంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ పిరియాడిక్ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓ బడా సంస్థ ఏకంగా రూ. 150 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్..

Advertisement

షూటింగ్ ఇంకా పూర్తి అవ్వకముందే ఇంత ధరకు అమ్ముడుపోవడం షాకింగ్ గానే ఉందని చెప్పాలి. కానీ ప్రభాస్ మూవీ అంటే ఆ మాత్రం ఉండాలిగా. మరి అంత రేంజ్ లో సినిమాను డైరెక్టర్ హను రాఘవపూడి తెరకేక్కిస్తారేమో చూడాలి.. ఈ సినిమా పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.. ఇక ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ క్రేజీ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి నవంబర్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చెయ్యనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో మూడు సినిమాల్లో నటించబోతున్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీలో నటించిన ఉన్నాడు. ఆ తర్వాత కల్కి 2 మూవీలలో నటించనున్నారని సమాచారం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×