Sandeep Raj: ప్రస్తుతం సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)తాను ప్రేమించిన ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల (Shobhita dhulipala)తో అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswarrao)విగ్రహం ముందు అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రముఖుల మధ్య చేసుకొని వివాహం చేసుకోగా.. ఇప్పుడు మరో డైరెక్టర్ వివాహం చేసుకున్నారు. తాను ప్రేమించిన ప్రముఖ హీరోయిన్ చాందినీ రావు (Chandhini rao) తో ఏడడుగులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
‘కలర్ ఫోటో’ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డును అందుకున్నారు డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep Raaj) ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరొకవైపు వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మనసిచ్చిన అమ్మాయితో కలిసి మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టాడు. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రాజ్ ‘చాయ్ బిస్కెట్’ షార్ట్ ఫిలిం తో భారీ పాపులారిటీ అందుకున్నారు. ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాతో దర్శకుడుగా మారి మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకోవడంతో ఈయన టాలెంట్ కింగ్ స్టార్ హీరోలు సైతం ఫిదా అవుతున్నారు.
కలర్ ఫోటోతో భారీ గుర్తింపు..
ఓటీటీ లో రిలీజ్ అయిన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న ఈయన, ఈ సినిమా తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్ లకు రచయితగా పనిచేస్తూ ఇంకొక వైపు డైరెక్టర్ గా కూడా తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు.. ఇక ఆయన కెరియర్ గురించి కాస్త పక్కన పెడితే, వ్యక్తిగత జీవితంలో తాజాగా పెళ్లి పీటలు ఎక్కారు. తాను దర్శకత్వం వహించిన కలర్ ఫోటో సినిమాలో ఒక కీలక పాత్రలో మెరిసిన హీరోయిన్ చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు.
ఎంగేజ్మెంట్ తో ఒక్కటైన జంట..
గత నెలలో సందీప్ రాజ్ చాందినీ రావుల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. గత నెల 11వ తేదీన ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ అనంతరం ఆ ఫోటోలను షేర్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెళ్లెప్పుడు చేసుకుంటారని అందరూ అడగ్గా.. అప్పుడు ఎవరూ కూడా వీరు నోరు మెదపలేదు. కానీ తాజాగా పెళ్లి చేసుకొని ఒక్కటే అయ్యారు.
తిరుపతిలో ఘనంగా పెళ్లి..
తిరుమల తిరుపతి దేవస్థానంలో సందీప్ రాజ్, హీరోయిన్ చాందిని రావుల పెళ్లి ఘనంగా జరిగింది.ఈ వేడుకకు కలర్ ఫోటో సినిమా హీరో సుహాస్ (Suhas) సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే వైవా హర్ష, రోషన్ తదితరులు ఈ వివాహానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. మొత్తానికి అయితే ఈ జంట ఏడడుగులు మూడుముళ్లతో ఒక్కటయ్యారని చెప్పవచ్చు. సందీప్ రాజ్ విషయానికి వస్తే.. యాక్టర్ గా డైరెక్టర్ గా.. స్టోరీ రైటర్ గా కూడా మంచి పేరు దక్కించుకున్నారు.