Big Tv Folk Night: :తెలంగాణ జానపద పాటలకు ప్రాణం పోస్తూ.. జానపద గాయని గాయకులకు ఒక గుర్తింపును కలిగిస్తూ.. ప్రముఖ బిగ్ టీవీ ఛానల్ నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్ బిగ్ టీవీ ఫోక్ నైట్ 2025.. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం.. 60 మంది తెలంగాణ ఫోక్ సింగర్స్ తో ఊహించని సక్సెస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ ఫోక్ సింగర్స్ అంతా కూడా ఒకే చోట చేరి తమ గొంతుకను వినిపించడంతో ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంతోమంది ప్రజలు తమను తాము మైమరచిపోయి పూర్తిస్థాయిలో డాన్స్ వేస్తూ తెగ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ ఈవెంట్ కూడా ఈ రేంజ్ లో సక్సెస్ అయిన దాఖలాలు కనిపించలేదు. అలా తొలిసారి బిగ్ టీవీ చేసిన ఒక వినూత్న ఆలోచన.. అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా.. ఈ ఫోక్ నైట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.
ది బిగ్గెస్ట్ ఫోక్ నైట్ ఫుల్ ఎపిసోడ్ ఆరోజే..
ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి వెళ్లలేని చాలామంది “అయ్యో మిస్సయ్యామే” అంటూ తెగ బాధపడిపోయారని సమాచారం. అందుకే ఇప్పుడు అలాంటి వారందరికీ బిగ్ టీవీ ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ను సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం సాయంత్రం 6:00 నుండి 10 గంటల వరకు ఎక్స్ క్లూజివ్ గా బిగ్ టీవీలో ప్రసారం చేయనున్నారు.ఆగస్టు 23వ తేదీన జానపద పాటలతో ఎల్బీ స్టేడియం.. అక్కడికి వచ్చిన ప్రజల డాన్సులతో దద్దరిల్లింది. అయితే ఇప్పుడు స్టేజ్ మాత్రమే కాదు ఇల్లు కూడా దద్దరిల్లబోతుంది అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒకే వేదికపై 60 మంది జానపద గాయని గాయకులు..
చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో తెలంగాణ పాటలకు ప్రాణం పోస్తూ నిర్వహించిన ఈ వేదికపై ఏకంగా 60 మంది జానపద గాయని, గాయకులు తమ గొంతును వినిపించారు. వారిలో విమలక్క, సుద్దాల అశోక్ తేజ, వందేమాతరం శ్రీనివాస్, మొగులయ్య, మధుప్రియ, వరంగల్ శ్రీనివాస్, మెట్ల తిరుపతి, బోళే షావళి, క్లెమెంట్, పెద్దపులి ఈశ్వర్, నార్సింగి నర్సింగ్ రావు, నల్గొండ గద్దర్, బుల్లెట్ బండి లక్ష్మణ్, రెలారే గంగ, కనకవ్వ, భిక్షమమ్మ, ఉషక్క, కళ్యాణ్ కీస్, మదీన్ ఎస్కే, రెలారే రషీద్, పాటమ్మ రాంబాబు, గడ్డము సంతోష్, వరమ్, రెలారే జాన్, రాము రాతోడ్, హనుమంతు యాదవ్, కొండ రాజేందర్, ప్రభ, వీణ, షోను సింగ్, స్పూర్తి జితేందర్, మమత, నాగ లక్ష్మీ, ముకుందా, మామిడి మౌనిక, కరుణాకర్, అశ్వీనీ రాతోడ్, బుల్లెట్ రాము, అరుణ్ రుక్సజ్ తో పాటు మరి కొంత మంది తెలంగాణ ఫోక్ సింగర్స్ పాటలు ఆలపించి శ్రోతలను అలరించారు.
ALSO READ:Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటికి డీఆర్ఐ భారీ షాక్..ఏకంగా 102 కోట్లు ఫైన్.. మిగతా వారికి?
THE BIG FOLK NIGHT 2025
WATCH FULL EPISODE
SUNDAY, 7TH SEP 2025
FROM 6PM TO 10PM
ONLY ON BIG TV#AnIntiativeByBigTv pic.twitter.com/qFFjdShJ34
— BIG TV Breaking News (@bigtvtelugu) September 2, 2025