దివ్వెల మాధురి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ప్రేమలో పడటం, ఆ తర్వాత అతడి అసలు కుటుంబంతో గొడవపడటం, రోడ్డు ప్రమాదాల డ్రామా ఆడటం.. అబ్బో ఈమె గురించి రాస్తే రామాయణం, చెప్తే భారతం అవుతుంది. పాత ముచ్చట్లు పక్కన పెడితే ప్రస్తుతం దువ్వాడ, దివ్వెల కలిసి సహజీవనం చేస్తున్నారు. సుమారు మూడున్నర పదుల వయసు ఉండే మాధురి, తనకంటే ఇంచుమించు రెంటింపు వయసున్న శ్రీనివాస్ తో హ్యాపీగా జాలీగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ గురించి తెలియని వారులేరని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో మాధురి హల్ చల్ మామూలుగా ఉండదు. ఎవరు ఏం అన్నా పట్టించుకోకుండా శ్రీనివాస్ తో తన జీవితాన్ని హ్యాపీగా గడుపుతోంది. తాజాగా మాధురి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా తన జీవితానికి సంబందించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పనిలో పనిగా ఒకప్పుడు తాను రికార్డింగ్ డ్యాన్స్ చేశానంటూ వైరల్ అవుతున్న వీడియోపైనా ఆమెన స్పందించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రికార్డింగ్ డ్యాన్స్ వీడియో తనది కాదని మాధురి చెప్పింది. అందులో డ్యాన్స్ చేసిన అమ్మాయి అచ్చం తనలాగే ఉందని వెల్లడించింది. ఒకవేళ ఆ వీడియో తనదే అని నిరూపిస్తూ కోటి రూపాయలు ఇస్తానని దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడో చెప్పారని వివరించింది. ఆ సవాల్ ను ఇప్పటి వరకు ఎవరూ స్వీకరించలేదని వెల్లడించింది. ఆ రికార్డింగ్ డ్యాన్స్ తనదే అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టినంత మాత్రన పట్టించుకోనని తేల్చి చెప్పింది. నెట్టింట చేసే ట్రోలింగ్ గురించి ఆలోచించడం ఎప్పుడో మానేసినట్లు చెప్పింది మాధురి.
ఇక తనకు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని దివ్వెల మాధురి చెప్పుకొచ్చింది. తనతో పాటు దువ్వాడకు కూడా ఆఫర్లు వస్తున్నట్లు వివరించింది. తనకు విలన్ లేదంటే పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేయాలని ఇష్టం ఉందని మనసులో మాట బయటపెట్టింది. నయనతార నటన తనకు ఎంతో బాగా నచ్చుతుందని, సూర్య నిజమైన హీరోలా కనిపిస్తాడని వివరించింది. జూనియర్ ఎన్టీఆర్ నటన కూడా తనకు ఎంతో నచ్చుతుందని చెప్పింది. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఎన్టీఆర్ సినిమాలంటే చాలా ఇష్టం అన్నది. జూనియర్ సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే ఫస్ట్ చూడాల్సిందేనని చెప్పుకొచ్చింది. తనకు బిగ్ బాస్ లోకి రమ్మని ఆహ్వానం వచ్చినా, శ్రీనివాస్ ను వదిలి ఉండడం ఇష్టం లేక వెళ్లలేదన్నది. అతడితో కలిసి తరచుగా రోడ్ ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు వివరించింది.
ఇక తనకు వింటేజ్ చీరలు అంటే చాలా ఇష్టం అని మాధురి చెప్పుకొచ్చింది. కాంచీవరం చీరలను బాగా ఇష్టపడతానని చెప్పింది. ఈ చీరలు మంచి నాణ్యతతో పాటు చక్కటి సౌకర్యాన్ని అందిస్తాయని చెప్పింది. తనకు వంటపని, ఇంటిపని అంటే ఎంతో ఇష్టమన్నది. దువ్వాడకు తన చేతి వంట ఎంతో ఇష్టమని చెప్పింది దివ్వెల మాధురి.
Read Also: వీడెవడండి బాబు.. చంపిన ప్రతి దోమను దాచిపెట్టి ఏం చేస్తున్నాడంటే?