BigTV English

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : టాప్ తెలుగు న్యూస్ ఛానెల్స్ లలో ఒకటి బిగ్ టీవీ. ప్రజలకు నిరంతరం వార్తలను అందించడం మాత్రమే కాదు.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడంలో ముందు ఉంటుంది. ఎన్నో ప్రోగ్రామ్ లను అందిస్తుంది. రీసెంట్ గా ఈ ఛానెల్ కిస్సిక్ టాక్ షోను స్టార్ట్ చేశారు.. ఈ షో ని స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పటివరకు ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు, సీరియల్ నటీనటులు ఎంతోమంది పాల్గొన్నారు.. ఈ షో తర్వాత ఆ సెలబ్రిటీల లైఫ్ మారిపోయింది అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాంటి క్రేజ్ ఉన్న ఈ షో కి తాజాగా టాలీవుడ్ యాక్టర్ గీతా సింగ్ గెస్టుగా వచ్చారు. ఈ మధ్య సినిమాల్లో కనిపించకపోవడానికి కారణాలను బయటపెట్టారు. ఒకరంగా యంగ్ డైరెక్టర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇవ్వండంటూ గీతా రిక్వెస్ట్..

సినీ నటి గీతా సింగ్ ఎంత మంచి నటి.. గతంలో ఈమె చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా నరేష్ సరసన నటించిన కితకితలు సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ మూవీతో ఆమె క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత బోలెడు సినిమాలు చేసింది. ఆ సినిమాలన్నీ కూడా మీకు మంచి హిట్ టాక్ ని అందించాయి. ఇప్పటివరకు ఈమె 50 సినిమాలకు పైగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈమధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. దీనిపై తాజాగా కిస్సిక్ షోలో సమాధానం చెప్పారు. సీనియర్ యాక్టర్స్ ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు. దానికి కారణం ఏమై ఉంటుందని యాంకర్ వర్ష అడిగింది. నీకు సమాధానం చెబుతూ… కేవలం జనరేషన్ గ్యాప్ అని అన్నది.. ఇన్ డైరెక్టర్స్ ఎక్కువగా వేరే భాషల్లోని వాళ్ళని తీసుకొచ్చి సినిమాల్లో పెడుతున్నారు.. మంచి రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారు.. కానీ ఇక్కడ మాలాంటి గొప్ప నటులు కూడా ఉన్నారని గుర్తించడం లేదు. ఇది గుర్తిస్తే బాగుంటుందని గీత సింగ్ రిక్వెస్ట్ చేశారు..


Also Read : ‘బ్రహ్మముడి ‘ స్వప్న.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

పక్కింటి పుల్లగూర మనవాళ్లకు ఇష్టం.. 

ఈమధ్య సినిమాలు గురించి మాట్లాడుతూ.. పాత డైరెక్టర్లు కూడా మాకు ఛాన్స్ ఇవ్వడం లేదు.. అలాగే కొత్త డైరెక్టర్లు కూడా మమ్మల్ని పట్టించుకోవడమే మానేశారు. అందుకే ఇలాంటి షోలకి వచ్చి మా గోడుని వెళ్లబుచ్చుకుంటున్నామని గీత సింగ్ అంటున్నారు.. మేము వేరే భాషల్లోని నటుల్లాగా డిమాండ్ చేయట్లేదు మీరు అంతిస్తే అంతే తీసుకుంటున్నాను దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని మాకు ఛాన్స్ ఇస్తే మంచిది అని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కింటి పుల్లగూర అంటే ఇష్టం అన్నట్లు ఇప్పుడు డైరెక్టర్లు ప్రవర్తిస్తున్నారు.. మీరిచ్చే ఒక్క ఛాన్స్ ఆర్టిస్టుల ఇల్లు కడవడానికి ఉపయోగపడుతుంది ఇది గుర్తించండి అంటూ ఇండైరెక్టుగా వార్నింగ్ కూడా ఇచ్చింది… ఇకపోతే గీత సింగ్ పెంచుకున్న కొడుకు ఇటీవలే చనిపోయారు. ఆ బాధ నుంచి ఇప్పటికీ ఆమె బయటికి రాలేదు అన్న విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. కనీసం ఇప్పటికైనా ఈ వీడియో చూసిన డైరెక్టర్లు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related News

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Big Stories

×