Daughter killed Mother: ప్రస్తుత రోజుల్లో మానవత్వం మంట కలుస్తుంది. ఆస్తుల కోసం రక్త బంధాలు, పేగు బంధాలను మరిచి దారుణాలకు ఒడిగడుతున్నారు. కన్నవారని కూడా మరచి పోయి భర్తతో కలిసి దారుణ హత్యకు పాల్పడింది ఓ కిరాతక కూతురు. నవమాసాలు మోసి.. కని,పెంచి పెద్ద చేసిన తల్లిని.. కన్న కూతురే భర్తతో కలిసి గొంతు నులిమి హత్య చేసింది.
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దారుణం
ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్దతండా గ్రామానికి చెందిన బాదావత్ లక్ష్మికి కుమార్తె సంగీత. అయితే ఆమెను దుబ్బ తండా ఎస్సీ గ్రామానికి చెందిన వీరన్నతో ఐదు ఏళ్ల క్రితం వివాహం చేసింది. లక్ష్మీకి ఉన్న ఎకరం భూమిలో 20 గుంటల భూమిని అమ్మి… ఇటీవలే కుమార్తె సంగీతకు 9 తులాల బంగారాన్ని ఇప్పించింది.
లక్ష్మి ఒప్పుకోకపోవడంతో ఆమెను చంపేందుకు ప్లాన్
అలాగే భూమిని అమ్మగా మిగిలిన డబ్బులతో పాటు 20 గుంటల భూమిని.. తమకు ఇవ్వాలని గత కొంతకాలంగా లక్ష్మీని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా మృతురాలు ఒప్పుకోకపోవడంతో ఆమెను చంపి ఆస్తిని కైవసం చేసుకోవాలని.. కుమార్తె సంగీత పక్కా పథకం వేసింది. దీంతో సంగీత తన భర్త వీరన్నతో కలిసి 2 రోజుల క్రితం లక్ష్మీ ఇంటికి చేరుకున్నారు.
తల్లి నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి.. హత్య చేశారు
అయితే పథకం ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మీని.. కుతూరు సంగీత, భర్త వీరన్నతో కలిసి గొంతు నులిమి హత్య చేసి, అదే రాత్రి కారులో వెళ్లిపోయారు. తెల్లవారేసరికి అక్కడి స్థానికులు గమనించగా లక్ష్మీ ఇంట్లో అనుమానస్పదంగా మృతి చెంది ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టాగా కుమార్తె సంగీత, అల్లుడు వీరన్నలు వచ్చి తామే ఆస్తికోసం చంపామని ఒప్పుకున్నారు.
Also Read: నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించిన బీజేపీ
గ్రామంలో విషాద ఛాయలు
మృతురాలి తండ్రి నేనావత్ చంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాలకుర్తి సీఐ తెలిపారు. తల్లిని కుమార్తె చంపడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆస్తి పిచ్చితో కన్న తల్లినే చంపుకున్న కూతురు ఇప్పుడు జైలుకి వెళితే ఆస్తి వస్తుందా..? తల్లి తిరిగి వస్తుందా? అని గ్రామంలో ప్రజలందరు ఆ కూతురిపై మండిపడుతున్నారు.