Telusu Kada Teaser: స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా.. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా‘.డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి చిత్రాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు సిద్దూ. ఆ తర్వాత వచ్చిన జాక్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఇప్పుడు తెలుసు కదా అంటూ వస్తున్నాడు. ప్రముఖ సెలబ్రిటీ స్టయిలిస్ట్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం మూవీ టీం ప్రమోషన్స్ వేగం పెంచింది. ఇందులో భాగంగా సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 1 1న టీజర్ విడుదల చేస్తున్నట్టు మూవీ ఇప్పటికే ప్రకటించింది. చెప్పినట్టుగానే గురువారం తెలుసు కదా టీజర్ని మూవీ టీం రిలీజ్ చేసింది.
టీజర్ మంచి రొమాంటిక్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకుంది. హీరో హీరోయిన్లకు హల్దీ రాస్తు కనిపించాడు. అప్పుడే.. ‘ఇది చాలా నాచ్చురల్గా జరగాల్సిన పని ఇది.. నాకు రాసిపెట్టు ఉన్నఅమ్మాయి ఎవరో తనంతట తనే నా లైఫ్లోకి రావాలి‘ సిద్దూ జోన్నలగడ్డ డైలాగ్తో టీజర్ మొదలైంది. అదే టైంలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నాలతో పరిచయం చూపించారు. టీజర్లో వైవా హర్ష్, సిద్ధు మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. మధ్యలో నీకు ఇష్టం కదా.. ఇలా.. ఇద్దరిద్దరి మధ్యలో దూరడం అనే డైలాగ్ సటైరికల్గా ఫన్నీగా ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత శ్రీనిధి శెట్టి సిద్దూ రొమాన్స్ చూపించారు. ఇద్దరు పార్టీలో డ్యాన్స్ చేస్తూ.. ఏం ఉన్నావ్ బేబీ.. 70 శాతం ఎంజిల్.. 30 పర్సంట్ డెవిల్ బేబీ నువ్వు అనే డైలాగ్ టీజర్‌కి హైలెట్గా నిలిచింది.
‘నువ్వు నవ్వుతుంటే.. ఇక్కడ వెదర్ డిస్టర్బ్ అవుతుంది‘ అంటూ సిద్దూ జొన్నలగడ్డ తనదైన స్టైల్లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక చివరిలో హీరో ఇద్దరు హీరోయిన్లతో పెళ్లి చేసుకుందాం.. పెళ్లి చేసుకుందాం అని చెప్పే డైలాగ్ ఆసక్తిని పెంచుతోంది. ఇక చివరిలో హర్ష చెముడ, సిద్దు మధ్య వచ్చిన సీన్ ఆకట్టుకుంది. అసలు ఏం అసలేం నడుస్తుందిరా మైండ్ అని అడగానే.. తెలుసు కదా అనే డైలాగ్తో టీజర్ ఎండ్ అవుతుంది. మొత్తానికి ఈ టీజర్ మూవీపై హైప్ పెంచుతుంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ బాగా ఆకట్టుకుంటోంది. సీన్, సీచ్చ్యువేషన్కి తగ్గట్టుగా తమన్ ఇచ్చిన బీజీఎం నెక్ట్స్ లెవెల్ అనెట్టుగా ఉంది. మొత్తానికి టీజన్ మ్యూజికల్, లవ్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంది.