BigTV English
Advertisement

Deepika – Shahrukh : బెయిల్ వచ్చేసింది… హైకోర్టులో దీపిక – షారుఖ్‌కు భారీ ఊరట

Deepika – Shahrukh : బెయిల్ వచ్చేసింది… హైకోర్టులో దీపిక – షారుఖ్‌కు భారీ ఊరట

Deepika – Shahrukh : బాలీవుడ్ లో స్టార్ హీరోగా సొంతం చేసుకున్న షారుక్ ఖాన్ (Shahrukh Khan), స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న దీపికా పదుకొనే (Deepika Padukone) ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అటు నార్త్ తో పాటు ఇటు సౌత్ లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వీరిద్దరూ.. గత కొంతకాలంగా ఒక కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరికి కోర్ట్ లో భారీ ఊరట కలిగింది అని చెప్పవచ్చు.


షారుక్ – దీపికలపై కేసు ఫైల్..

అసలు విషయంలోకి వెళ్తే.. సెక్యూరిటీ ఫీచర్స్ లేని ఒక కారు కంపెనీకి.. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు అంటూ దీపికా పదుకొనే, షారుక్ ఖాన్ లపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసు నిమిత్తం రాజస్థాన్ హైకోర్టు వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ ప్రాంతానికి చెందిన అడ్వకేట్ కీర్తిసింగ్ (Keerthi Singh) హ్యుందాయ్ కారును కొనుగోలు చేశారు. అయితే ఈ కారులో చాలా లోపాలు ఉన్నాయని.. తాను బ్రాండ్ అంబాసిడర్లని చూసే ఈ కారు కొనుగోలు చేశానని, తనకు న్యాయం జరగాలి అంటూ షారుక్ ఖాన్, దీపికా పదుకొనే తో పాటు మరో ఆరుగురిపై కీర్తి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వీరిపై ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేశారు.

ప్రశ్నలు గుప్పించిన షారుక్ ఖాన్ తరఫు న్యాయవాది..


అయితే బాధితురాల కీర్తి సింగ్ మాత్రం అక్కడితో ఆగకుండా ఏకంగా రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటీషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ షారుక్ ఖాన్ తరఫున వాదిస్తూ.. “తన క్లైంట్ షారుక్ ఖాన్ కు ఈ కేసుతో నేరుగా ఏమాత్రం సంబంధం లేదని.. పిటిషనర్ ఆరోపించిన డిఫెక్ట్లకు అతడు బాధ్యత ఎలా వహిస్తాడు?” అంటూ ప్రశ్నించారు. ఎండార్స్మెంట్స్, తయారీ ప్రమాణాలకు బాధ్యతను సూచించవని కూడా ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు..

దీపిక తరఫు న్యాయవాది ఏమన్నారంటే?

అటు దీపికా పదుకొనే న్యాయవాది మాధవ్ మిత్రా కూడా ఇవే విషయాలను ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్ళింది. “తన క్లైంట్ దీపికా పదుకొనేకు కార్ల ఉత్పత్తి, నాణ్యత నియంత్రణలో ఎటువంటి ముఖ్యపాత్ర లేదు అని, అడ్వకేట్ కీర్తి సింగ్ చేసిన ఆరోపణలు దీపిక, షారుఖ్ ఖాన్ ఎండార్స్మెంట్లు, వినియోగదారులను పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని” వారు స్పష్టం చేశారు.

ముందస్తు బెయిల్ మంజూరు.. సెప్టెంబర్ 25కి విచారణ వాయిదా..

ఇక దీంతో ఇరు పక్షాల వాదనలను విన్న రాజస్థాన్ హైకోర్టు న్యాయస్థానము అటు దీపికా పదుకొనే ఇటు షారుక్ ఖాన్ తో పాటు మరో ఆరుగురి పై నమోదైన ఎఫ్ఐఆర్ పై స్టే విధిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. అంతేకాదు తదుపరి విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి అయితే ఎండార్స్మెంట్ లో భాగంగా కేసు ఫైల్ అవ్వగా.. ఇప్పుడు వీరికి భారీ ఊరట కలిగించింది అని చెప్పవచ్చు.

also read:Bigg Boss 9 Telugu: ఇమ్మూ గెటప్ అదుర్స్.. గొడవల మధ్య నవ్వుల వాతావరణం!

Related News

Film Chamber : సేవ్ ఫిలిం ఛాంబర్… హైదరాబాద్ లో నిర్మాతలు నినాదాలు.. అసలేం జరుగుతుంది?

Kingdom : కింగ్డమ్ సినిమాలో మురుగన్ క్యారెక్టర్ వదులుకున్న తెలుగు నటుడు

Dil Raju: విజయ్ దేవరకొండను సైడ్ చేసిన దిల్ రాజు.. రంగంలోకి కుర్ర హీరో?

Spirit: స్పీడ్ పెంచిన ప్రభాస్, స్పిరిట్ షూటింగ్ అప్పుడే మొదలైపోతుంది

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ వచ్చేసింది, బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది

Mass jathara trailer delay: మళ్లీ ట్రైలర్ లేటు, ఈ దర్శక నిర్మాతలు ఎప్పటికీ మారుతారు?

Thiruveer : ప్రభాస్ సినిమాలలో అవకాశం మిస్ చేసుకున్న యంగ్ హీరో తిరువీర్ 

Sachin Chandwade: సూసైడ్ చేసుకున్న యంగ్ హీరో.. ఆలస్యంగా వెలుగులోకి?

Big Stories

×