BigTV English

Bigg Boss 8 Telugu : షాకిస్తున్న వీకెండ్ ఓటింగ్.. డేంజర్ జోన్లో టాప్ కంటెస్టెంట్..!

Bigg Boss 8 Telugu : షాకిస్తున్న వీకెండ్ ఓటింగ్.. డేంజర్ జోన్లో టాప్ కంటెస్టెంట్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. రేపటితో 14 వారం కూడా పూర్తి అవుతుంది. పదమూడోవ వారం హౌస్లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది.. హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం కూడా ఇద్దరు ఎలిమినేట్ అవుతారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రతి వీకెండ్ లాగే ఈ వారం కూడా కూడా ఓటింగ్ రివర్స్ అయ్యినట్లు తెలుస్తుంది. మరి ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు? ఓటింగ్ లో టాప్ ఎవరు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్ బాస్ హౌస్ లో 14 వ వారం నామినేషన్స్ లేవు. ఒక్క అవినాష్ ను తప్ప అందరిని నామినేట్ చేసాడు బిగ్ బాస్. సోమవారం నుంచి ఇప్పటివరకు వరుసగా విచిత్రమైన టాస్క్ లను ఇస్తూ హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెడుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌ ఇవాళే షూట్ చేయనున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 పద్నాలుగో వారం ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను రేపు ప్రసారం చేయనున్నారు. అయితే ఈరోజు హౌస్ లోకి యాంకర్ ఓంకార్ హౌస్ లోకి వచ్చి సందడి చెయ్యనున్నారు. ఆయన వెళ్లిన తర్వాత నాగ్ ఎలిమినేషన్, అలాగే విన్నర్ ను ప్రకటించానున్నారని సమాచారం. ఇక ఈ వారం ఓటింగ్ విషయానికోస్తే విష్ణు ప్రియా లీస్ట్ లో ఉందని తెలుస్తుంది.

ఇకపోతే ఈ వారం నామినేషన్స్‌లో టికెట్ టు ఫినాలే సాధించి మొదటి ఫైనలిస్ట్ అయిన అవినాష్ తప్పా మిగతా అంతా నామినేట్ అయ్యారు. దాంతో బిగ్ బాస్ 8 తెలుగు 14వ వారం బిగ్ బాస్ చేసిన నామినేషన్స్‌లో విష్ణుప్రియ, నిఖిల్, గౌతమ్, రోహిణి, నబీల్, ప్రేరణ ఆరుగురు ఉన్నారు. వీరికి ప్రారంభమైన ఓటింగ్ పోల్‌లో టాప్ 2 స్థానాల్లో నిఖిల్, గౌతమ్ నిలుస్తూ వస్తున్నారు.. ఇక డేంజర్ జోన్లో విష్ణుప్రియ, రోహిణికి డేంజర్ బెల్స్ మోగనున్నాయి. మొదటి నుంచి విష్ణుప్రియ ఐదు లేదా ఆరో స్థానంలోనే ఉంటూ వస్తోంది. డిసెంబర్ 5 ఎపిసోడ్‌లో ఓట్ అప్పీల్ టాస్క్‌లు ఆడి గెలిచి అవకాశం అందుకుని ప్రేక్షకులను ఓట్లు వేయమని అభ్యర్థించింది విష్ణుప్రియ.. కానీ ఆమెను జనాలు ఇక హౌస్ లో చూడాలని అనుకోవట్లేదేమో ఓటింగ్ మారలేదు. కానీ, ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్‌లో ఆమె స్థానం ఏమాత్రం మారలేదు. వీకెండ్ వచ్చేసరికి డేంజర్ జోన్‌లో టాప్ 2 బాటమ్‌లో రోహిణి, విష్ణుప్రియ లు ఈ వారం బయటకు వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ రోజు తెలియనుంది..


ఇక ప్రేరణ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజుతో ఎవరు ఉంటారు? ఎవరు పోతారు? అన్నది తెలియనుంది. ఇక డిసెంబర్ 15 న బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే జరగనుందని సమాచారం.. ఇక ఆ ఈవెంట్ కు మెగా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్టుగా రాబోతున్నట్లు గత కొద్ధి రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 

Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×