Karnatana News: వివాహేతర సంబంధాలు ఎక్కువగా బాధితులు భర్తలే అవుతున్నారు. ఈ ఉచ్చు నుంచి బయటకు రాలేక చాలామంది ఈ లోకాన్ని విడిచి పెడుతున్నారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఈ స్టోరీలో మాత్రం భర్త గాయాలతో బయటపడగా, భార్య మాత్రం కటకటాల పాలైంది. సంచలనం రేపిన ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా నూరేళ్లు జీవించాల్సిన భార్యాభర్తల బంధం మధ్యలోనే పెటాకులవుతోంది. పైన కనిపిస్తున్న ఆమె పేరు సునంద పూజారి. వయస్సు 29 ఏళ్లు. కర్ణాటకలోని విజయపుర జిల్లా ఇండి తాలూకాలోని ఓ గ్రామంలో ఉంటున్నారు. ఆమెకు బీరప్పతో దశాబ్దం కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు పిల్లలు ఉన్నారు.
కొంత భూమి అమ్మేసి అప్పులు తీర్చాడు బీరప్ప. జీవనం కోసం పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్లారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. కాకపోతే సిద్ధప్పతో సునందకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహంగా మారింది. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో భర్త బీరప్పతో ప్రేమ తగ్గింది. ఎలాగైనా సిద్ధప్పతో జీవితం పంచుకోవాలన్న కోరిక రోజు రోజుకూ పెరిగింది.
భర్త ఉంటే తన కోరిక నెరవేరదని భావించింది సునంద. భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. ఎప్పటి మాదిరిగానే బీరప్ప పనులు చేసి ఇంటికొచ్చి గదిలో నిద్రపోతున్నాడు. ఎంత నిద్ర లేపినా భర్త లేవలేదు. ఇదే సరైన సమయం అని భావించిన సునంద.. ప్రియుడు సిద్ధప్పకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాలని సూచన చేసింది. సెప్టెంబర్ ఒకటి సోమవారం అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చాడు.
ALSO READ: జనగామలో దారుణం.. ఆస్తి కోసం తల్లిని చంపిన కూతురు
తలుపు గడియ తీయడంతో లోపలికి వచ్చాడు ప్రియుడు. గదిలో నిద్రపోతున్న భర్తను చూపి వాడ్ని గొంతు పిసికి చంపేసెయ్ అని ప్రియుడ్ని రెచ్చగొట్టింది. బీరప్ప గుండెలపై కూర్చుని గొంతు నులిమి కడతేర్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు సిద్ధప్ప. కానీ బీరప్ప తన శక్తిని ఉపయోగించి ప్రతిఘటించాడు.
బీరప్పు-సిద్దప్పల మధ్య పెనుగులాట జరుగుతున్న సమయంలో మంచం పక్కనే కూలర్ ఒక్కసారిగా కింద పడిపోయింది. మరో గదిలో పడుకున్న సునంద కొడుకు భయంతో అక్కడికి వచ్చాడు. అదే సమయంలో బీరప్ప ఆందోళనతో పెద్దగా కేకలుపెట్టాడు. చివరకు సునంద-సిద్ధప్ప భయపడి ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు.
సిద్ధప్పతో కలిసి భర్త హత్యకు సునంద చేసిన ప్రయత్నం విఫలమైంది. జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బీరప్ప. ఘటనలో గాయపడిన బీరప్ప ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఘటనకు ముందు భార్య సునందను పలుమార్లు హెచ్చరించాడు ఆమె భర్త. పరారీలో ఉన్న సునంద బుధవారం అరెస్టు చేశారు. సిద్ధప్ప కోసం గాలింపు తీవ్రం చేశారు పోలీసులు.