BigTV English

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Advertisement

Kissik Talks Show : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నారు. ఈమధ్య ఈ ఛానల్ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ షో కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. జబర్దస్త్ వర్ష ఈ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు, సీరియల్ స్టార్స్ పాల్గొని తమ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈ షో కి హీరోయిన్, కమెడియన్ గీత సింగ్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలోని ఎన్నో విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆమె ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. అసలు ఆమె మొదటి సినిమా ఏది? ఫస్ట్ రెమ్యూనరేషన్ఎంత ఇప్పుడు మనం తెలుసుకుందాం..


గీతా సింగ్ ఫస్ట్ మూవీ & రెమ్యూనరేషన్..?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లరి నరేష్ నటించిన సినిమాలలో అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు కితకితలు. దీనికన్నా ముందుగా ఆర్యన్ రాజేష్ తో ఎవడి గోల వాడిదే సినిమాలో నటించారు. ఆ తర్వాత కితకితలు సినిమాలో లీడ్ రోల్ పోషించి ఆడియెన్స్ ను అలరించింది.. మొదటి సినిమా కన్నా రెండో సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఆమె ఇమేజెస్ పెరిగిపోయింది. అయితే మొదట సినిమా ఆఫర్ రావడం కొంచెం సంతోషంగానే ఉండింది. కానీ మా నాన్నగారు ఏమంటారనే భయం కూడా ఉండేది అని ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. ఎలాగోలాగా మొదటి సినిమా అయితే పూర్తి చేశాను. తర్వాత అందరూ నన్ను అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలో మొదటి సినిమా రెమ్యూనరేషన్ గురించి వర్షా అడగ్గా.. అస్సలు దాచి పెట్టుకోకుండా మొదట వచ్చిన సినిమాకు రూ. 10 వేలు తీసుకున్నట్లు చెప్పింది గీత.. అప్పట్లో అది ఎక్కువే అందుకే ఒప్పేసుకున్నాను అని అన్నారు.


Also Read : ‘బ్రహ్మముడి ‘ స్వప్న.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

గీతా సింగ్ సినిమాల విషయానికొస్తే..

తెలుగు నటి గీతా సింగ్ మొదటి నుంచి ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ.. ప్రేక్షకులను తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఎవడిగోల వాడిదే సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది. కానీ స్టార్ గుర్తింపు అయితే రాలేదు. ఆ తర్వాత వచ్చిన అల్లరి నరేష్ సినిమా కితకితలు సినిమాలో నటించింది. ఒక్కసారిగా మూవీతో స్టార్ హీరోయిన్ కన్నా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది.. నా పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే మూవీ ఇదే అన్నట్లు బాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. ప్రేమాభిషేకం, దొంగల బండి, శశిరేఖా పరిణయం, ఆకాశ రామన్న, సీమ టపాకాయ్‌, కెవ్వు కేక, కళ్యాణ వైభోగమే, రెడ్, జంప్ జిలానీ, సరైనోడు, ఈడో రకం అడో రకం, తెనాలి రామకృష్ణ తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పటివరకు దాదాపు 50 సినిమాలకు పైగా ఆమె నటించింది.. ప్రస్తుతం గీతా చేతిలో సినిమాలు లేవని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ షో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×