BigTV English

Flipkart Big Billion Days: స్మార్ట్‌ఫోన్‌ కొనే టైమ్‌ వచ్చేసిందోచ్! ఫ్లిప్‌కార్ట్ మైండ్‌బ్లోయింగ్ డిస్కౌంట్లు!

Flipkart Big Billion Days: స్మార్ట్‌ఫోన్‌ కొనే టైమ్‌ వచ్చేసిందోచ్! ఫ్లిప్‌కార్ట్ మైండ్‌బ్లోయింగ్ డిస్కౌంట్లు!

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ అంటే ఆన్‌లైన్ షాపింగ్‌లో ఒక పెద్ద బ్రాండ్ అని అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం పండుగల సీజన్‌ వచ్చేసరికి ఈ కంపెనీ భారీ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో వినియోగదారుల మనసు గెలుచుకుంటుంది. ఆ లిస్ట్‌లోనే టాప్‌లో నిలిచే సెల్‌ ది బిగ్ బిలియన్ డేస్. ఈ సంవత్సరం కూడా అదే తరహాలో, మరింత ఆకర్షణీయంగా ఈ సెల్‌ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే, అసలు సెల్‌ మొదలయ్యే ముందే, కస్టమర్ల ఉత్సాహాన్ని పెంచేందుకు ఎర్లీ బర్డ్ డీల్స్ పేరుతో కొన్ని బెస్ట్ ఆఫర్‌లు ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే ఉన్నాయి.


ఇక ఈ ఎర్లీ బర్డ్ డీల్స్‌లో ప్రత్యేకంగా హైలైట్ అవుతున్నది స్మార్ట్‌ఫోన్ కేటగిరీ. మనకు తెలిసినట్లుగా, స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు మన జీవితంలో భాగమైపోయాయి. కాబట్టి ఇలాంటి సెల్‌ అంటే ఎక్కువ మంది మొట్టమొదట చూసేది మొబైల్‌ ఆఫర్లపైనే. ఆ పాయింట్‌ను ఫ్లిప్‌కార్ట్ బాగా అర్థం చేసుకుని, అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ను ముందుగానే షేర్ చేసింది.

ఈ సెల్‌లో ఐఫోన్ 15 సిరీస్‌పై భారీ ఆఫర్లు ఉంటాయని బజ్. ఐఫోన్ ధరలు సాధారణంగా ఎక్కువగా ఉండటంతో చాలా మంది వెనక్కి తగ్గుతారు. కానీ ఈసారి బిగ్ బిలియన్ డేస్‌లో ప్రైస్ ట్యాగ్‌ను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. కేవలం ఐఫోన్ మాత్రమే కాదు, సామ్‌సంగ్ గాలక్సీ ఎస్ సిరీస్, గూగుల్ పిక్సెల్ ఫోన్లు, వన్‌ప్లస్ మోడల్స్ అన్నీ ప్రత్యేక డిస్కౌంట్లతో రానున్నాయి.


ఇక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్‌ కోసం చూస్తున్న వారికి కూడా మంచి ఆఫర్లు సిద్ధం చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. రెడ్‌మి, రియల్‌మి, పోకో, మోటరోలా వంటి బ్రాండ్‌లు కూడా ఎర్లీ బర్డ్ డీల్స్‌లో ఉన్నాయి. కొంతమంది మోడల్స్‌ ఎంఐఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లతో వస్తే, ఎటువంటి కాస్ట్ ఈఐఎం సదుపాయంతో అందుబాటులో ఉంటుంది. అంటే ఎవరి అవసరానికైనా, ఎవరి బడ్జెట్‌కైనా సరిపోయేలా డీల్స్‌ ప్లాన్ చేశారు.

Also Read: Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ తేదీన ట్రాఫిక్ చలాన్ల మాఫీ? ఇలా చెయ్యండి

స్మార్ట్‌ఫోన్‌లకే కాకుండా, స్మార్ట్‌వాచెస్, హెడ్‌ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు వంటి గాడ్జెట్‌లపైనా ఎర్లీ బర్డ్ డీల్స్‌లో మంచి ఆఫర్లు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, స్మార్ట్‌వాచ్‌లు సాధారణ ధరతో పోలిస్తే సగం ధరకే రావొచ్చని సమాచారం. గేమింగ్ ల్యాప్‌టాప్‌ల మీద కూడా మంచి డిస్కౌంట్లు పెట్టబోతున్నారని లీక్ అవుతోంది.

అదే విధంగా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌స్‌తో షాపింగ్ చేస్తే తక్షణ తగ్గింపు కూడా దక్కనుంది. అంటే డీల్ పైన డీల్ లాంటి ప్రయోజనం దక్కబోతోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ మెంబర్స్‌కి ఎర్లీ యాక్సెస్‌ కూడా ఇవ్వనుంది.

ఇక పండుగ సీజన్ దగ్గరపడుట, ప్రతి కుటుంబం గిఫ్ట్‌లు, కొత్త వస్తువుల కోసం ఎదురుచూస్తోంది. అలాంటి సమయంలో బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లు వస్తే, కస్టమర్లకు మించి ఆనందం ఇంకేముంటుంది? ముఖ్యంగా కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్లు అయితే ఈ సేల్‌లను తప్పకుండా గమనించాలి.

మొత్తం మీద, ప్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్ డేస్ ఎప్పటిలాగే ఈసారి కూడా ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రేమికులకి ఒక ఫెస్టివల్‌లా మారబోతోందని చెప్పొచ్చు. ఎర్లీ బర్డ్ డీల్స్‌తోనే ఇప్పటికే హైప్‌ క్రియేట్ అయింది. ఇక అసలు సెల్‌ ప్రారంభమైన తర్వాత ఏవేవి కొత్త సర్ప్రైజెస్ వస్తాయో చూడాలి.

Related News

Vi Business Plus: వ్యాపారానికి ఉత్తమ 5జి ప్లాన్.. విఐ బిజినెస్ ప్లస్ ప్రత్యేక ఆఫర్

Jio Cricket Offer: క్రికెట్ అభిమానుల కోసం జియో కొత్త ఆఫర్..మూడు నెలలు లైవ్ క్రికెట్.. కానీ చిన్న ట్విస్ట్?

DMart Ready App: డీమార్ట్ బంపర్ ఆఫర్.. 50శాతం వరకు డిస్కౌంట్లు, మూడు ఆర్డర్లకు ఉచిత డెలివరీ

JioMart Offer: జియోమార్ట్ బంపర్ ఆఫర్.. మొదటి ఆర్డర్‌కి రూ.100 తగ్గింపు!

iPhone 17 Prices: ఐఫోన్ 17 ధరలు షాక్! భారత్ vs అమెరికా vs జపాన్ – తెలుసుకున్నారా?

Big Stories

×