NTR – Neel:రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో.. గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్(Jr NTR). ఈ సినిమా తర్వాత ‘దేవర’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన.. తొలిసారి బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసి అక్కడ హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో ‘వార్ 2’ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇందులో తొలిసారి విలన్ గా నటించారు. బాలీవుడ్ లో తొలి చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఏర్పడినా.. సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకులను అలరించలేదు. దీంతో ఎన్టీఆర్ కి బాలీవుడ్ రంగ ప్రవేశం పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈయన కేజీఎఫ్ 1&2, సలార్ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య అటు షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కన్నడ సినీ ఇండస్ట్రీలో హీరోగా సత్తా చాటి , ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్గా హీరోగా రికార్డ్ సృష్టించిన రిషబ్ శెట్టి (Rishabh Shetty) ఎన్టీఆర్ కోసం ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ALSO READ:Deepika – Shahrukh : బెయిల్ వచ్చేసింది… హైకోర్టులో దీపిక – షారుఖ్‌కు భారీ ఊరట
ఆ పాత్ర ఏదో తెలుసా..?
అసలు విషయంలోకి వెళ్తే.. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువగా కర్ణాటకలోని జరుగుతోంది. పైగా కర్ణాటకలో ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందిఅటు తారక్ కూడా తన మూలాలను మరింత బలపరుచుకోవడానికి, కన్నడలో అభిమానులను పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కన్నడ ఆడియన్స్ కు మరింత దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్న ఎన్టీఆర్.. రిషబ్ శెట్టిని సంప్రదించి ఇందులో నటించాలని కోరారట. రిషబ్ శెట్టి కూడా ఎన్టీఆర్ తో ఉన్న స్నేహబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా ఒప్పుకున్నట్లు సమాచారం.
ఆశ్చర్యపోతున్న ఆడియన్స్..
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఈ డ్రాగన్ మూవీలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఒక క్యామియో పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే ఒక కీ రోల్ కోసం రిషబ్ శెట్టిని సంప్రదించగా.. రిషబ్ శెట్టి కూడా ఒప్పుకున్నట్లు కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ ప్రయత్నాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా సఫలం అవుతున్నాయని చెప్పవచ్చు. అసలే రిషబ్ శెట్టి ఎన్టీఆర్ మధ్య సాన్నిహిత్యం చాలా ఎక్కువగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు కూడా కర్ణాటకలో పలు ప్రదేశాలు ప్రదర్శించారు. ఫ్యామిలీలతో కలిసి పలు దేవాలయాలు సందర్శించారు కూడా.. ఇప్పుడు ఆ సాన్నిహిత్యం తోనే ఎన్టీఆర్ అడిగిన వెంటనే అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి కూడా కామెడీ పాత్ర చేయడానికి రిషబ్ శెట్టి ఒప్పుకున్నాడని తెలిసి ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.