E-Paper
Advertisement

Rakshith Shetty: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు..

Rakshith Shetty: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు..
Advertisement

Rakshith Shetty (celebrity news today) : కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదయ్యింది. తన పాటలను కాపీ చేసి రక్షిత్ తన సినిమాలో పెట్టుకున్నాడని నవీన్ కుమార్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. అసలు విషయం ఏంటంటే.. రక్షిత్ శెట్టి హీరోగా బ్యాచిలర్ పార్టీ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించాడు.

ఇక ఈ సినిమాలోని పాటల కోసం ముందుగా MRT మ్యూజిక్ కంపెనీలో పనిచేస్తున్న నవీన్ కుమార్ తో చర్చలు జరిపారు. అనంతరం ఆ చర్చలు విఫలమవడంతో నవీన్ కుమార్ సినిమాలో భాగం కాలేకపోయాడు. అయితే వారి అనుమతి లేకుండా గాలిమాతు, న్యాయ ఎల్లిడి అనే పాటలను సినిమాలో ఉపయోగించారు.

Advertisement

సినిమా రిలీజ్ అయ్యాకా, ఆ సాంగ్స్ కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇక తమ అనుమతి లేకుండా తమ పాటలను సినిమాలో ఎలా ఉపయోగిస్తారని ఆరోపిస్తూ రక్షిత్ శెట్టికి చెందిన పరమవా స్టూడియోస్ పై, అతనిపైన కూడా నవీన్ కేసు పెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ కేసుపై కానీ, కాపీ ఆరోపణలపై కానీ రక్షిత్ ఇప్పటివరకు నోరు విప్పలేదు.

రక్షిత్ శెట్టి గురించి తెలుగువారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాజీ లవర్ గా అతడు తెలుగువారికి సుపరిచితం. ఆ తరువాత తెలుగులో అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ, సప్త సాగరాలు దాటి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రక్షిత్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఈ కాపీ ఆరోపణలపై అతడు ఎలా స్పందిస్తాడో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×