BigTV English

First movie of suhas in theatre : హీరోగా థియేటర్స్‌లోకి వస్తోన్న సుహాస్ తొలి సినిమా ఏదో తెలుసా

First movie of suhas in theatre : హీరోగా థియేటర్స్‌లోకి వస్తోన్న సుహాస్ తొలి సినిమా ఏదో తెలుసా

First movie of suhas in theatre : సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఫిబ్రవరి 3న ఈ మూవీ విడుదలవుతుంది. మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సుహాస్ మాట్లాడుతూ ‘‘శరత్ , అనురాగ్ లేకపోతే నేను లేను. ఇంతమంచి సినిమాని నా దగ్గరకి తీసుకొచ్చిన ప్రశాంత్ కి కృతజ్ఞతలు. మ్యూజిక్ చేసిన శేఖర్ చంద్రకి, బిజియం చేసిన కళ్యాణ్ కి కృతజ్ఞతలు. ఎడిటర్ పీకే కి, డీవోపీ వెంకట్ రమణకి కృతజ్ఞతలు. ఫిబ్రవరి 3న సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుంది. ఇది నా మొదటి థియేట్రికల్ రిలీజ్ సినిమా. కలర్ ఫోటో థియేటర్ లో రాకవడం చాలా బాధగా వుంది. ఈ సినిమాతో వస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. సినిమా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెండు మూడు గంటలు హ్యాంగోవర్ లో వుంటారు. ఈ ఇక్కడి వచ్చిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ తెలిపారు.


షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మాతలు కాగా జి. మనోహరన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజయవాడకు చెందిన ఒక మధ్యతరగతి యువకుడు పద్మభూషణ్ గుర్తింపు పొందిన రచయిత కావాలని కలలు కంటాడు. చివరకు అతను తన మొదటి పుస్తకాన్ని ప్రచురిస్తాడు. అది నిరాశపరుస్తుంది. అందరూ అతన్ని కించపరిచినప్పుడు, టీనా అతనిని గొప్ప రచయితగా గుర్తిస్తుంది. కానీ కథలో ఒక ట్విస్ట్ ఉంది, ఇది ప్రేమ కథకు ట్రబుల్స్ తెస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 3న రిలీజ్ అవుతున్న సినిమా చూడాల్సిందే.

Follow this link for more updates : Bigtv


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×