E-Paper
Advertisement

Game Changer: రా మచ్చ మచ్చ.. ఒక్క సాంగ్ కే ఇన్ని ఎలివేషన్సా..?

Game Changer: రా మచ్చ మచ్చ.. ఒక్క సాంగ్ కే ఇన్ని ఎలివేషన్సా..?
Advertisement

Game Changer:  గ్లోబల్ స్టార్  రామ్ చరణ్ – శంకర్ కాంబోలో  తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా  నిర్మిస్తున్న  ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో  చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి మేకర్స్ అధికారికంగా  రిలీజ్ చేయడం కన్నా లీక్స్ వలనే  ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికింది అంటే  వాస్తవమే అని చెప్పాలి.

ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ నుంచి అధికారికంగా మేకర్స్ రిలీజ్ చేసినవి ఏవైనా ఉన్నాయంటే.. కేవలం పోస్టర్స్ మాత్రమే. చివరకు జరగండి జరగండి సాంగ్ కూడా ముందు ఆడియో లీక్ అయ్యి.. తరువాత వీడియో లీక్ అయ్యి..  లాస్ట్ లో సాంగ్  ను రిలీజ్ చేశారు. ఇక దాని ఎఫెక్టో ఏమో కానీ.. సెకండ్ సాంగ్ పై మాత్రం మేకర్స్  కొద్దిగా కేర్ తీసుకున్నారు. రా మచ్చ మచ్చ అంటూ సాగే సాంగ్ ప్రోమోను సెప్టెంబర్ 28 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్  ప్రకటించిన విషయం తెల్సిందే.

Advertisement

సాధారణంగా  సినిమా రిలీజ్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ  ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. కానీ,  గేమ్ ఛేంజర్ టీమ్ మాత్రం ఒక సాంగ్  రిలీజ్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా రా మచ్చ మచ్చ సాంగ్ గురించి  డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్  ఒక ఇంటర్వ్యూ టైప్ లో మాట్లాడిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రా మచ్చ మచ్చ సాంగ్ అసలు ఎలా మొదలైంది.. ? స్పెషల్ సాంగ్ గా ఎందుకు మారింది.. ? అనేది శంకర్ వివరించాడు. ఈ సాంగ్ కోసం 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులను ఉపయోగించినట్లు శంకర్ తెలిపాడు.

ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్,జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు ఈ సాంగ్ లో కనిపించారని తెలిపాడు. ఈ సాంగ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని, దీనికి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ  చేసినట్లు తెలిపిన శంకర్.. ఈ సాంగ్ కోసం చరణ్ ఎంతో కష్టపడ్డట్లు తెలిపాడు. అంతేకాకుండా ఇందులో రామ్ చరణ్ సింగిల్ టేక్ లో చేసిన  డ్యాన్స్  మూమెంట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక ఈ ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్  30 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.  ఇవన్నీ విన్నాక.. చరణ్ ఫ్యాన్స్ హైప్ తోనే పోయేలా ఉన్నారు. ఒక్క సాంగ్ కే ఇన్ని ఎలివేషన్సా..?  అని  కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో  చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×