E-Paper
Advertisement

December Fight: గ్లోబల్ స్టార్ వర్సెస్ ఐకాన్ స్టార్.. వచ్చేది ఎవరు.. ? గెలిచేది ఎవరు..?

December Fight: గ్లోబల్ స్టార్ వర్సెస్ ఐకాన్ స్టార్.. వచ్చేది ఎవరు.. ? గెలిచేది ఎవరు..?
Advertisement

December Fight: ఇండస్ట్రీలో ఒకేరోజు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతూ ఉంటాయి. ఎక్కువగా ఇలాంటి పోటీలు సంక్రాంతి సమయంలో జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మూడు రోజులు స్టార్ హీరోల సినిమాలు థియేటర్ లో ఢీ అంటే ఢీ అని పోటీ పడుతుంటాయి. ఏ హీరో గెలుస్తాడు.. ? ఏ హీరో ఓడిపోతాడు.. ? అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఇదంతా కామన్ గా జరిగేదే.

అయితే ఇలాంటి ఒక ఫైట్.. సంక్రాంతికి ముందే రాబోతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అందులోనూ గ్లోబల్ స్టార్ వర్సెస్ ఐకాన్ స్టార్ అనగానే .. ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఈపాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది.

Advertisement

అల్లు అర్జున్, రామ్ చరణ్.. డిసెంబర్ లో పోటీకి దిగుతున్నారు అని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. ఇటు పక్క రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో బిజీగా ఉన్నాడు. రెండు సినిమాలపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మొదటి నుంచి పుష్ప ఆగస్టు 15 న రిలీజ్ కానుందని మేకర్స్ చెప్పుకుంటూ వచ్చారు.

కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. అదే రోజున రామ్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. ఇక ఎప్పటినుంచో గేమ్ ఛేంజర్.. డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు పుష్ప 2 వాయిదా పడడంతో.. అది కూడా డిసెంబర్ కు షిఫ్ట్ అయ్యింది. అది కాకుండా పుష్ప కూడా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ తోనే పుష్ప 2 కూడా క్రిస్టమస్ కే షిఫ్ట్ అయ్యిందని అంటున్నారు.

Advertisement

ఇక చరణ్ కూడా గేమ్ ఛేంజర్ ను క్రిస్టమస్ కానుకగా దింపాలని చూస్తున్నాడట. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోల్లో డిసెంబర్ ఎవరి సొంతం అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక వీరిద్దరి మధ్య ఇలాంటి డేట్ క్లాష్ ఇప్పుడే కాదు చాలాసార్లు వచ్చింది. మరి ఈసారి వచ్చేది ఎవరు.. ? గెలిచేది ఎవరు..? అనేది చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×