E-Paper
Advertisement

Harish Shankar: జర్నలిస్ట్ తో హరీష్ శంకర్ గొడవ.. ముదిరేలా ఉందే

Harish Shankar: జర్నలిస్ట్ తో హరీష్ శంకర్  గొడవ.. ముదిరేలా ఉందే
Advertisement

Harish Shankar: డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో హరీష్ శంకర్ బిజీగా మారాడు. ఇప్పటికే పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇది కొంచెం లేట్ అవ్వడంతో మధ్యలో రవితేజతో మిస్టర్ బచ్చన్ మొదలుపెట్టాడు. త్వరత్వరగా ఈ సినిమాను ఫినిష్ చేసి రిలీజ్ కు కూడా రెడీ చేస్తున్నాడు.

ఇక హరీష్ సినిమాల గురించి పక్కన పెడితే.. సోషల్ మీడియా లో తన గురించి కానీ, తన సినిమా గురించి కానీ, ఏదైనా నెగెటివ్ మాట్లాడినా.. వాళ్ళకు నిర్మొహమాటంగా వార్నింగ్ ఇచ్చేస్తూ ఉంటాడు. అలానే కొన్నిరోజుల క్రితం ఒక జర్నలిస్ట్.. మిస్టర్ బచ్చన్ గురించి ఏదో మాట్లాడాడని.. ఆయన పేరు చెప్పకుండా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరో జర్నలిస్ట్ తో కూడా హరీష్ శంకర్ గొడవ పెట్టుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

Advertisement

ఒక జర్నలిస్ట్.. మిస్టర్ బచ్చన్ నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుందని, 12.60 కోట్లు నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్.. మరో 2 కోట్ల 40 లక్షలు..రిటర్న్ బుల్ అడ్వాన్స్ అని రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ కు హరీష్ ఫైర్ అయ్యాడు. మీకు ఇంటర్వ్యూ ఇద్దామని అనుకున్నాను.. దాన్ని చెడగొట్టుకోకండి. ప్రస్తుతానికి ఇది రిక్వెస్ట్ మాత్రమే అని లైట్ గా వార్నింగ్ ఇచ్చాడు.

ఇక దానికి సదురు జర్నలిస్ట్ సైతం ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఇక్కడ నేను చేసిన తప్పు ఏమిటి?.. డిస్ట్రిబ్యూటర్ చెప్పింది వేయడమా?..మీ ఇంటర్వూ నేనేమీ అడగలేదే. నేను తప్పు అంకె వేస్తే ఖండించండి. రిక్వెస్ట్ కాదు..వార్నింగ్ అయినా…తప్పు చేస్తే భయపడాలి అని ఆన్సర్ ఇచ్చాడు.

Advertisement

దీనికి కూడా హరీష్ తగ్గకుండా.. మీరు తప్పు చేశారు అని నేను అనుకొని ఉంటే రిక్వెస్ట్ అనే వాడిని కాదు. ట్రాన్సక్షన్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఇద్దరితో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇకపోతే మీరు ఇంటర్వ్యూ అడిగారని నాకు ఒక పర్సన్ చెప్పాడు.. మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పినట్టే అని చెప్పుకొచ్చాడు. దీనికి జర్నలిస్ట్ మరో కౌంటర్ వేశాడు.

“నేను మీ ఇంటర్వూ కావాలని అడగలేదు. మరోసారి క్లారిటీగా చెబుతున్నా మీ పీఆర్ ఫోన్ చేసి, హరీష్ గారు మీకు ఫస్ట్ ఇంటర్వూ ఇస్తారట కానీ ఆయన కెమేరా కూడా పెట్టుకుంటారట మీకు ఓకెనా అని అడిగారు. దానికి నేను ఓకె..వన్ సెకెండ్ కూడా కట్ చేయకుండా అప్ లోడ్ చేస్తాను అని చెప్పాను. కొన్నవారే ఇంతకు కొన్నాము అని చెప్పింది.. వేసాను. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్..మీ సినిమా విషయంలో మాత్రమే కాదు. న్యూస్ సేకరించడం అన్నది నా వృత్తి.” అని చెప్పుకొచ్చాడు  ప్రస్తుతం వీరిద్దరి మధ్య గొడవ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది ఇంకా ముదురుతుందా.. ? లేక ఇదేమైనా ప్రమోషన్ స్టంటా.. అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×