E-Paper
Advertisement

Nithin : ఆ స్టార్ హీరో కోసం హీరో నితిన్ షాకింగ్ డెసిషన్ .. షాక్ లో ఫ్యాన్స్ ?

Nithin : ఆ స్టార్ హీరో కోసం హీరో నితిన్ షాకింగ్ డెసిషన్ .. షాక్ లో ఫ్యాన్స్ ?

Nithin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జయం సినిమాను మొదలుకొని ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాల్లో నటించి యూత్ అభిమానుల మనసు దోచుకున్నాడు. అలాగే ఫ్లాప్ సినిమాలు కూడా ఈ హీరో అకౌంట్ లో ఎక్కువగానే ఉన్నాయి. గత ఏడాది నితిన్ తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మారాయి. ఇప్పుడు కథల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు . ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అయితే ఒకవైపు సినిమాలను చేస్తూనే మరోవైపు సినిమాలను తెరకెక్కించే పనిలో ఉన్నాడని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో సినిమాకు నిర్మాతగా మారాడని వార్తలు వినిపిస్తున్నాయి . ఆ సినిమా ఏంటి ? హీరో ఎవరో ఒకసారి తెలుసుకుందాం..

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌ లో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ మూవీ ఓ తమిళ దర్శకుడి చేతికి వెళ్ళిందట.. వెంకటేష్ ఓ తమిళ దర్శకుడి తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ దర్శకుడు టిఎన్.సంతోష్ డైరెక్షన్‌లో త్వరలోనే ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో వెంకటేష్‌ని హీరోగా తీసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వెంకీకి ఈ సినిమా కథను వినిపించారట.
ఆ కథ బాగుండటం తో సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది..

ఈ సినిమా కథ నచ్చిన యంగ్ హీరో నితిన్ తన హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌ పై ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారట. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కాప్‌గా వెంకటేష్ నటించబోతున్నాడట. కానీ, ఆయన ఈ సినిమాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, ఆయన ఓకే చెప్పిన తరువాత ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు వెంకీ కూడా సమూహకంగా ఉన్నారని టాక్. ఇక వెంకీ కూడా రెండు సినిమాలను చేస్తున్నాడు. అటు నితిన్ మూడు సినిమాలను అనౌన్స్ చేసాడు. ఆ సినిమాలను త్వరగా కంప్లీట్ చేసేందుకు చూస్తున్నాడు. అందులో రాబిన్ హుడ్ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది . ఈ సినిమాను డిసెంబర్ 20 న విడుదల చేయనున్నారు. ఆ సినిమా పై నితిన్ ఆశలు పెట్టుకున్నాడు. దొంగ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా హిట్ పైనే మిగిలిన సినిమాల ఫలితాలు ఉన్నాయి మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×