BigTV English

Samantha Updates : సీరియల్ ట్విస్ట్స్ కన్నా సమంత లైఫ్ లో ట్విస్టులే ఎక్కువగా ఉన్నాయా?

Samantha Updates : సీరియల్ ట్విస్ట్స్ కన్నా సమంత లైఫ్ లో ట్విస్టులే ఎక్కువగా ఉన్నాయా?
Samantha new Updates

Samantha new Updates(Latest Tollywood News) :

గత కొద్ది కాలంగా హాలిడే ట్రిప్స్ అంటూ హంగామా చేస్తూ పలు రకాల ఫొటోస్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది సమంత. నిన్ను కాక మొన్న రెడ్ కలర్ శారీ తో ఇన్స్తా లో ఆమె పెట్టిన పోస్ట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. మొన్నటికి మొన్న ఖుషి సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో విజయ్ దేవరకొండతో స్టేజ్ పై హాట్ డాన్స్ కూడా చేసింది. రీసెంట్ గా సమంత సోషల్ మీడియా పోస్టులో అభిమానులు మరొక విషయాన్నీ కూడా కనిపెట్టారు. అదేమిటంటే ఆమె తన శరీరం పైనుంచి మాజీ భర్త అక్కినేని నాగచైతన్య టాట్టూని తొలగించింది.


రీసెంట్ గా చైతన్య పెళ్లి తర్వాత దత్తత తీసుకున్న మహేష్ అదే వాళ్ళ పప్పీ ఫోటోను షేర్ చేశాడు. దాంతో ఇద్దరికీ పాచ్అప్ అయిపోయింది అని సోషల్ మీడియాలో తెగ పుకార్లు వచ్చాయి. అయితే దానికి సమాధానంగా సమంత తన దుబాయ్ పర్యటన నుంచి కొన్ని ఫొటోస్ షేర్ చేయడం జరిగింది. అందులో క్లియర్ గా ఆమె తన శరీరం పై నుంచి ‘చై’ అని ఉన్న టాట్టూని తొలగించడం క్లియర్ గా కనిపించేలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.

అది ఆమె వ్యక్తిగత విషయమైనప్పటికీ సోషల్ మీడియాలో దానిపై పెద్ద చర్చే జరిగింది. సరే ఏదో డైవర్స్ అయింది ..ఆ తర్వాత కాస్త హెల్త్ ఇష్యూస్ వచ్చాయి.. తర్వాత కోలుకుంది ..మళ్లీ సినిమాలు చేసింది…మరో పక్క తన హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో ఓ రేంజ్ సంచలనం క్రియేట్ చేసింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ సడన్ గా సమంత ఆస్పత్రిలో చేరినట్టు ..చేతికి డ్రిప్ తో బెడ్ పై విశ్రాంతి తీసుకుంటున్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మ‌యోసైటిస్ వ్యాధితో సంవత్సరం పాటు పోరాటం చేసిన సమంత క్రమంగా కోలుకుంది. మరి అయితే ఇప్పుడు హాస్పిటల్లో ఎందుకు చేరింది అని డౌట్ రాక మానదు. మరోపక్క సోషల్ మీడియాలో సమంత హాస్పిటల్లో చేరింది అని ఈ ఫోటోని రీపోస్టు చేసి బాగా వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఈ విషయంపై సమంత క్లారిటీ ఇస్తూ మరొక పోస్ట్ పెట్టింది. నిజానికి సమంతకు ప్రస్తుతానికి ఏమంత సీరియస్ గా లేదు.. ఆమె తీసుకుంటున్న ఐవీ కేవలం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి తీసుకుంటున్న ఒక చిన్న ప్రికాషన్.

సమంత తాజాగా త‌న‌కు మ‌యోసైటిస్ ఏం చేయడానికి మందులు ఎలా ఉపయోగపడ్డాయి అనే వివరాలను కూడా మరొక పోస్టులో వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఐవీ ద్వారా మందులు తీసుకుంటున్న ఫోటో అది.. పైగా ఆ ఫోటోతో పాటు సమంత తన పోస్ట్ లో హైదరాబాద్‌లోని డిజైర్ ఈస్తటిక్స్ అనే స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌ ను టాగ్ చేసింది.

మన దేహంలో ప్రధానంగా పోషకాహార లోపాలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించడానికి ఐవీ ద్వారా పోషకాలను శరీరంలోకి పంపిస్తారు. అయితే ఈ ఒక్క చికిత్స మాత్రమే వ్యాధి నివారణకు పరిష్కారం కాదు. మనకు ఎదురయ్యే వైద్య పరిస్థితిలను బట్టి కన్సల్టింగ్ ఫిజీషియన్ ద్వారా కొన్ని టెస్టులు చేశాక మనం సలహాలు పొందాల్సి ఉంటుంది అని సామ్ తన పోస్టులో తెలిపారు.అసలు విషయం తెలిసాక అంత మాత్రానికి ఇంత హంగామా అవసరమా అని అనుకునేవారు ఉన్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×