BigTV English

Mega princess : మెగా ప్రిన్సెస్ జాతకం ఇదే..! సాక్షాత్తూ మహాలక్ష్మే పుట్టిందా..?

Mega princess : మెగా ప్రిన్సెస్ జాతకం ఇదే..! సాక్షాత్తూ మహాలక్ష్మే పుట్టిందా..?


Mega princess : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన రాత్రి 1.49 గంటలకు పండంటి పాపకు జన్మినిచ్చారు. తమకు ఎంతో ఇష్టమైన మంగళవారం రోజు పాప పుట్టడం ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. ఉపాసన గర్భవతిగా ఉన్న సమయం నుంచే రామ్ చరణ్ కెరీర్ పరంగా ఎంతో ముందుకు దూసుకెళ్లాడని అన్నారు.

చిరంజీవి మనువరాలి జాతకం బాగుందని జంధ్యాల జగన్నాథ శాస్త్రి తెలిపారు. మేష లగ్నంతో పాప జన్మించిందన్నారు. ఆ చిన్నారిది పునర్వసు నక్షత్రంగా పేర్కొన్నారు. ఇది రాముడి నక్షతమని చెప్పారు. విష్ణు అంశంతో ఉన్న నక్షత్రంగా వివరించారు. లగ్నంలో గురుడు ఉన్నాడని వెల్లడించారు. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతిదేవి ముగ్గురమ్మల మూలపుటమ్మల అంశంలో చిన్నారి పుట్టిందని స్పష్టం చేశారు. సాక్షాత్తూ శ్రీజగన్మాతే జన్మించిందన్నారు.


పూరి జగన్నాథుడుడి రధ యాత్ర మంగళవారమే ప్రారంభమైంది. అందుకే చాలా శుభప్రదమైన రోజుగా జంధ్యాల జగన్నాథశాస్త్రి చెప్పారు. సాక్షాత్తు మహలక్ష్మిదేవే మెగా ఫ్యామిలీ ఇంట పుట్టిందని వివరించారు. ఈ చిన్నారి రామ్ చరణ్, ఉపాసన ఇరు కుటుంబాల ఖ్యాతిని పెంచుతుంది జాతకం చెప్పారు. కీర్తితో పైకి వస్తుందని తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండో మూవీ మగధీరతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. 2012లో ఉపాసనను వివాహమాడాడు. ఈ దంపతులు ఇటీవల 11వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. 12వ ఏడాదిలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు జూన్ 20న ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఇప్పుడు జూన్ 20న రామ్ చరణ్ కు పాప పుట్టడం.. ఇలా 2 నెంబర్ మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్ గా మారిందని ఫ్యాన్స్ అంటున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×