BigTV English

Hot Spot Trailer: ఛీఛీ.. ఏం సినిమారా ఇది.. మరీ ఇన్ని పచ్చి బూతులా.. చిన్న పిల్లతో కూడా..

Hot Spot Trailer: ఛీఛీ.. ఏం సినిమారా ఇది..  మరీ ఇన్ని పచ్చి బూతులా.. చిన్న పిల్లతో కూడా..

Hot Spot Trailer: ఈ మధ్యకాలంలో సినిమాల్లో అశ్లీలత ఉంటుందో.. అసలు అశ్లీలతతోనే సినిమాలు తీస్తున్నారో అర్ధం కావడం లేదు. ఒకప్పుడు సినిమా మొత్తంలో ఒకటి రెండు బూతులు మాత్రమే వినిపించేవి. కానీ, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో బూతులే ఎక్కువ ఉంటున్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. తాజాగా ఒక తమిళ్ సినిమా ఇలాంటి అశ్లీలత ఉన్న కంటెంట్ తోనే వస్తుంది.


కోలీవుడ్ నటులు కలైయరసన్, సోఫియా, శాండీ, అమ్ము అభిరామి, జనని అయ్యర్, గౌరీ కిషన్, ఆదిత్య భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హాట్ స్పాట్. ఈ చిత్రానికి విగ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 29 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్నే అందుకుంది.

తాజాగా ఈ సినిమా తెలుగులో ఆహా ఓటీటీలో రిలీజ్ కు సిద్దమవుతుంది. దీంతో ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం బూతులతో నింపేశారు. అడల్ట్ కంటెంట్ అనేట్టు ఉన్నా.. ట్రైలర్ ను చూసి సినిమాను అంచనా వేయొద్దని చెప్పి షాక్ ఇచ్చారు. ఇక ఇందులో నటించినవారు అందరు తెలుగువారికి కూడా సుపరిచితమే.


96 సినిమాలో చిన్నప్పటి త్రిష, విజయ్ సేతుపతిగా నటించిన గౌరీ కిషన్, ఆదిత్య భాస్కర్ జంటగా ఈ సినిమాలో కనిపించారు. ట్రైలర్ లో మూడు జంటలు.. వారి మధ్య జరిగిన సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇక చివర్లో చిన్నపాప తో కూడా సెక్సీ లుక్ ఉన్నానా అని అనే డైలాగ్ చెప్పించడంతో .. అసలేం సినిమారా ఇది అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే సినిమా చూస్తే కానీ, కథ ఏంటి .. ? అనేది తెలియదని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×