Big TV kissik talks : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ఈ మధ్య వరుసగా కొత్త ప్రోగ్రామ్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తుంది. ఈమధ్య ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న కిస్సిక్ టాక్ షో కి మంచి ఆదరణ లభిస్తుంది.. జబర్దస్త్ ద్వారా ఫేమ్ వర్ష ఈ షోకు యాంకర్ గా వ్యవహారిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం కాబోతోంది. ప్రతివారం పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ షో ద్వారా ఎంతోమంది తమకు జరిగిన అన్యాయాలను కూడా బయట పెడుతూ వచ్చారు.. తాజాగా ఢీ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ వచ్చారు. ఈ షో ద్వారా ఎన్నో విషయాలను మాస్టర్ బయటపెట్టారు. ఈ ఎపిసోడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్టేజ్ పై అమ్మాయిలతో పండు..
బుల్లితెర పై ప్రసారమవుతున్న ప్రముఖ డాన్స్ షో ఢీ డాన్స్ మాస్టర్ పండు ఈ షో కి గెస్ట్ గా విచ్చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండు ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. తన గురించి చెబుతూ అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాదు… నీళ్లు పెట్టించే తన స్టోరీని కూడా పంచుకున్నాడు. అయితే పండు స్టేజ్ మీద అమ్మాయిలతో చేసే బిహేవియర్ నిజమేనా అని చాలామందికి డౌట్ రావచ్చు. అయితే అది కేవలం స్క్రిప్ట్ లో భాగమే అని పండు అంటున్నాడు. డాన్సర్ గా మాత్రమే కాదు ఒక నటుడిగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను అందుకే ఇలా టీజ్ చేస్తున్నట్లు చేస్తున్నాను అని పండు తెలిపాడు.
Also Read:జీతాల పెంపు.. సినీ కార్మికులకు లేబర్ కమీషన్ పెట్టిన కండీషన్స్ ఇవే..!
పండు పరువు తీసిన వర్ష..
ఈ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న వర్ష పండుతో ఎన్నో తెలియని విషయాలు సమాధానం చెప్పించింది. తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను బయటపెట్టించింది. ఇంత ఫేమొచ్చింది నీకు ఇంకా సొంత ఇల్లు లేదా అని వర్ష పండు ని అడిగింది. మాస్టర్ నిజంగానే నాకు సొంత ఇల్లు లేదు మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజమని అన్నాడు. నేను ఎప్పుడూ నా పేరెంట్స్ ని సంతోషంగా గొప్పగా చూసుకోవాలని అనుకున్నాను. నాకు ఎప్పుడొచ్చిన డబ్బుల్ని అప్పుడు వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళ సంతోషాన్ని నా సంతోషంగా ఫీలయ్యాను అని పండు మాస్టర్ అన్నాడు. అయితే సొంత ఇల్లు లేదు కానీ ఇంట్లోకి దూరే అలవాటు ఉందా అంటూ వర్ష పండు పరువు తీసేసింది.. వీరిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. ఈ ఎపిసోడ్ ని చూసిన ఆయన అభిమానులు పండ్లు మాస్టర్ చాలా మంచి వ్యక్తి అంటూ కామెంట్లు పెడుతున్నారు.