Peddi : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలలో విపరీతమైన అంచనాలు ఉన్న సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన బుచ్చి మొదటి సినిమాతోనే 100 కోట్లు కొట్టాడు.
ఇక పెద్ది సినిమా విషయానికొస్తే రామ్ చరణ్ ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసను మాట్లాడుతున్నాడు. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో కూడా విపరీతంగా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్ లో జరుగుతుంది. ఇదివరకే గోదావరి యాసతో అందరినీ ఆకట్టుకున్న చరణ్ ఇప్పుడు ఉత్తరాంధ్ర యాసతో ఆకట్టుకోబోతున్నాడు.
పెద్ది సినిమా రిజెక్ట్ చేసిన నటి
పెద్ది సినిమాలో రామ్ చరణ్ కు మదర్ గా నటించాలి అని ఒక మలయాళం యాక్టర్స్ ను అడిగారు బుచ్చిబాబు. అయితే తాను మాత్రం ఖచ్చితంగా చేయను అని మొహం మీద చెప్పేసింది. అది మరెవరో కాదు శ్వాసిక విజయ్.
ఇంతకు ఎవరు ఈ శ్వాసిక విజయ్ అంటే, టీవీలో ఈమె ఒక న్యూస్ ప్రెజెంటర్. ఆమె స్వాసికగా బాగా పాపులర్ అయింది. ఆమె కొన్ని తమిళ చిత్రాలతో పాటు మలయాళ సినిమాలు కూడా చేసింది. కొన్ని సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేసింది.. వసంత, కుమారి,వివేకానందన్ విరలాను, లుబ్బర్ పాండ చిత్రాలలో తన పాత్రలకు విపరీతమైన పేరు వచ్చింది.
ఎటు చూసినా నువ్వే చిత్రంతో తెలుగు సినిమాలో అడుగుపెట్టింది. నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు లో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించారు. కానీ రామ్ చరణ్ సినిమాను మాత్రం రిజెక్ట్ చేశారు. ఈ టైంలో రామ్ చరణ్ కు మదర్ గా చేయడం కరెక్ట్ కాదు అని ఆవిడకు అనిపించడం వల్లనే రిజెక్ట్ చేశారట.
పెద్దిపై భారీ అంచనాలు
ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. గతంలో విజయ్ సేతుపతి ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ రామ్ చరణ్ సరసన నటిస్తుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. చాలామంది పెద్దపెద్ద టెక్నీషియన్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. విపరీతమైన అంచనాలతో ఉన్న ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో వచ్చే ఏడాది తెలుస్తుంది.
Also Read: Rajasaab : రాజా సాబ్ లైన్ క్లియర్, ఇంకా ఇంత వర్క్ పెండింగ్ లో పెట్టారా?