Anasuya: అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj) పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ వెండి తెరపై ఎంతో బిజీగా ఉన్నారు. వరుస సినిమా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో బుల్లితెరకు అనసూయ దూరమైన సంగతి తెలిసిందే. జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న ఈమె క్రమక్రమంగా సినిమా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ అనసూయ కెరియర్ పరంగ బిజీగా ఉన్నారు. ఇలా సినిమాలో మాత్రమే కాకుండా ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా అనసూయ సందడి చేస్తున్నారు.
చెత్తగా వైజాగ్ బీచ్..
ఇక అనసూయ కెరియర్ విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఏ విషయం గురించి అయినా ఎంతో ముక్కుసూటిగా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె వైజాగ్ బీచ్(Vizag Beech) కి సంబంధించి కొన్ని వీడియోలను ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. ఇందులో భాగంగా తాను గత రెండు రోజులుగా ఓ పని మీద వైజాగ్ లో ఉన్నానని అయితే వైజాగ్ బీచ్ కి వెళ్ళగా తనకు చాలా బాధ కలిగిందని తన మనసులో ఆవేదన మొత్తం బయటపెట్టారు. గత రెండు సంవత్సరాల క్రితం తాను వైజాగ్ వచ్చానని అప్పుడు చాలా శుభ్రంగా ఉంది కానీ ఇప్పుడు మాత్రం చాలా చెత్త పేరుకుపోయిందని తెలిపారు.
గుమ్మడికాయ దొంగలు…
బీచ్ లో అలలు వచ్చిన ప్రతిసారి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ వస్తువులు బయటకు కొట్టుకొని వస్తున్నాయని, ఆవేదన చెందారు. ఈ విషయాలన్నీ నేను చెప్పకూడదని అనుకున్నాను కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇదంతా చూస్తుంటే చాలా కోపం వస్తుంది. కోపంతో చెబితే ఏవేవో ట్రోల్ చేస్తారు గుమ్మడికాయ దొంగలు అంటూ తనని విమర్శించే వారి గురించి మాట్లాడారు. కాని వాటికి నేను భయపడను నేను ఏది చెప్పాలనుకుంటున్నానో అది చెప్పేస్తున్నాను.
వాళ్ల ఇల్లు కూడా చెత్తగానే ఉంటుంది…
ఇలా బీచ్ కానీ, ఫారెస్ట్ కానీ, రోడ్లను ఎవరైతే చెత్త చేస్తారో వాళ్ళు ఇల్లు కూడా చెత్తగానే ఉండాలి. అంతే ఇది వారికి నేను పెట్టే శాపం అంటూ ప్రకృతిని ఇబ్బంది పెట్టే వారి గురించి, ప్రకృతిని నాశనం చేసే వారి గురించి అనసూయ మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బీచ్ చూస్తుంటే చాలా అందంగా ఉంది కానీ ఇక్కడ పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయిందని, ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అంటూ వైజాగ్ బీచ్ లో ఉన్న ఆ పరిశుభ్రత గురించి అనసూయ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా వీడియోలను షేర్ చేశారు. ఇలా అనసూయ షేర్ చేసిన ఈ వీడియోలపై కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Sreemukhi: శ్రీముఖికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన బాలు.. నిజంగానే ప్రేమలో పడ్డాడా ఏంటీ?