OG Second Single: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓ జి ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తమన్ తన రేంజ్ ఏంటో మరోసారి ఈ పాటతోనే చూపించాడు. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్వతహాగా సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఎలా చూపిస్తాడు అని మిగతా కళ్యాణ్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది.
గబ్బర్ సింగ్ సినిమా విడుదలైనప్పుడు చాలామంది హడావిడి చేశారు. ఆ సక్సెస్ కొట్టిన వెంటనే పవర్ స్టార్ పవర్ స్టార్ అని సుజిత్ అరిచిన వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. సుజిత్ సినిమా అనౌన్స్ చేయగానే ఆ వీడియోలు సోషల్ మీడియాలో మళ్లీ దర్శనమిచ్చాయి. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
సెకండ్ సింగిల్ అప్డేట్
ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కటౌట్ కి సరిపడా లిరిక్స్, ఎలివేషన్స్, బీభత్సమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. అది ఒక పవర్ స్ట్రోమ్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక మెలోడీ సాంగ్ రాబోతుంది. “సువ్వి సువ్వి” అనే ఈ సెకండ్ సింగిల్ ను ఆగస్టు 27న విడుదల చేస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. ట్రెడిషనల్ గా ప్రియాంక చీర కట్టుకోవడం పక్కనే వైట్ షర్ట్ లో పవన్ కళ్యాణ్ మెరిసిపోవడం అంతా కూడా చూడముచ్చటగా అనిపిస్తుంది. ఈ సినిమా కోసం పర్ఫెక్ట్ జంటను క్రియేట్ చేశాడు సుజిత్.
Also Read: Mass Jathara : మాస్ జాతర టీం కు లీగల్ నోటీసులు, నిర్మాత వంశీకి దెబ్బ మీద దెబ్బ