Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏకంగా మారిపోయింది. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనంత మార్కెట్ ప్రభాస్ కి ఉంది అని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఇప్పటికే ప్రభాస్ కెరియర్ లో 2 వెయ్యి కోట్లు సినిమాలు ఉన్నాయి. సలార్ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 50 సినిమాలు నిర్మించిన కూడా ఆ బ్యానర్ కి సరైన హిట్ సినిమా అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బ్రో సినిమా అంతంత మాత్రమే ఆడింది. ఇప్పుడు ఆ బ్యానర్ ప్రెస్టేజ్ ని పెంచే సినిమా రాజా షాప్ అవుతుంది అని చాలామంది ఊహిస్తున్నారు.
లైన్ క్లియర్ అయింది
ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమా కార్మికులకు నిర్మాతలకు మధ్య వేతనాల విషయంపై చర్చలు జరిగాయి. ఆ తరుణంలో విశ్వప్రసాద్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్కిల్ గురించి మాట్లాడారు. దానివలన రాజా సాబ్ సినిమాకి పనిచేయవలసిన కార్మికులు వెనక్కి తగ్గినట్లు వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్ గా లైన్ క్లియర్ అయిపోయింది. రేపటి నుంచి రాజా సాబ్ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
చాలా వర్క్ పెండింగ్ లో ఉంది
రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా గతంలో అనౌన్స్ చేశారు. అయితే సంక్రాంతి సీజన్ లో ఈ సినిమాని తీసుకురావడానికి విశ్వప్రసాద్ చూస్తున్నారు. హిందీ మార్కెట్ దృష్ట్యా డిసెంబర్ కరెక్ట్, తెలుగు మార్కెట్ ప్రకారంగా సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్. మొత్తానికి ఈ సినిమా తుది దశలో ఉంది అనుకునే టైమ్ కి కొత్త ట్విస్టులు తెలుస్తున్నాయి. ఈ నెలాఖరు వరకూ అజీజ్ నగర్ లో షూటింగ్ జరగనుంది. 28 వరకూ ప్రభాస్ పై కొన్ని కీలకమైన స్ననివేశాలు షూట్ చేయనున్నారు. సెప్టెంబరు 17 నుంచి కేరళలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్. ఆ తరవాత.. గ్రీస్ లో రెండు పాటలు చిత్రీకరణ. ఇక్కడితో సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుందని అర్థం అయిపోతుంది.
Also Read: OG Second Single: ఓజి సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్ , ఆహా పోస్టర్ లో చూడముచ్చని జంట