BigTV English

Tollywood Cine Workers : జీతాల పెంపు.. సినీ కార్మికులకు లేబర్ కమీషన్ పెట్టిన కండీషన్స్ ఇవే..!

Tollywood Cine Workers : జీతాల పెంపు.. సినీ కార్మికులకు లేబర్ కమీషన్ పెట్టిన కండీషన్స్ ఇవే..!

Tollywood Cine Workers : టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. జీతాలు సరిపోవడం లేదని, చాలా జీతాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ కార్మికులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు లేబర్ కమిషన్ నిర్మాతలు మధ్య చర్చలు జరిగాయి.. దాదాపు 18 రోజుల నిరీక్షణకు తెరపడింది. ఇండస్ట్రీలో షూటింగ్స్కు లైన్ క్లియర్ అయ్యింది.. ఫిలిం ఫెడరేషన్ యూనియన్స్, ఫిలిం చాంబర్ మధ్య చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. సుదీర్ఘ చర్చల తర్వాత సినీ కార్మికుల వేతనాల పెంపునకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా కొన్ని కండిషన్స్ తప్పకుండా కార్మికులు ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. ఆ కండీషన్స్ ఏంటో కాస్త వివరంగా చూద్దాం..


సినీ కార్మికులకు గుడ్ న్యూస్..

సినీ కార్మికులు షూటింగ్ లను ఆపేసి జీతాల పెంపు పై రోడ్డెక్కారు. తమకు 30 శాతం వేతనాలు పెంచాలని కోరుతూ సినీ కార్మికులు ఆగస్టు 4 నుంచి సమ్మెకు దిగారు. ఈ అంశంపై పలు మార్లు చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇండస్ట్రీ పెద్దలు.. మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలయ్య లను కూడా కలిశారు. చిరంజీవి నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో కలిసి వేర్వేరుగా చర్చలు జరిపారు. చివరకు సీఎం చొరవతో కార్మిక శాఖ వద్ద ఫెడరేషన్ నాయకులు, ప్రొడ్యూసర్స్ మధ్య చర్చలు జరిగాయి.. ఇన్నిరోజుల సమ్మెతో ఫలితం దక్కింది. అయితే.. కొన్ని షరతులతో వేతనాల పెంపునకు ఓకే చెప్పడంతో వివాదం ముగిసింది. అటు, మెగాస్టార్ చిరంజీవి సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు సీఎం రేవంత్ కు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇరు వర్గాలకు సమన్యాయం చేశారని అన్నారు.. మొత్తానికి సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు.


లేబర్ కమీషన్ కండీషన్స్..

ఫెడరేషన్ నాయకులు, ఫిలిం చాంబర్ పెద్దల మధ్య గత కొన్ని రోజులుగా జీతాల పెంపు పై చర్చలు జరుగుతున్నాయి. పలుమార్లు చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కార్మిక శాఖతో పాటు అధికారులతో కూడా చర్చలు జరిగాయి.. 4 కండిషన్లతో వేతనాల పెంపునకు ఓకే చెప్పారు.

నాలుగు కండీషన్స్ ఇవే.. 

*. సినీ కార్మికులకు 22.5 శాతం వేతనాల పెంపునకు ప్రొడ్యూసర్స్ అంగీకారం తెలిపారు.

*. రూ.2 వేల లోపు వేతనాలు ఉన్న వారికి ఫస్ట్ ఇయర్ 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం వేతనాలు పెంచనున్నారు.

*. రూ.2 వేల నుంచి రూ.5 వేల వేతనం ఉన్న వారికి తొలి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచనున్నారు.

*. ఈ మేరకు కార్మికులు, ప్రొడ్యూసర్స్ మధ్య ఒప్పందం కుదిరినట్లు కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ తెలిపారు..

Also Read : ఈ వీకెండ్ కూడా యానిమేషన్ మూవీదే హవా.. అక్కడ కూలిపోయిన ‘కూలీ’..

దాదాపు 18 రోజులు పాటు జరిగిన ఈ సమ్మె నిన్నటితో ఒక కొలిక్కి వచ్చేసింది.. ఫెడరేషన్, నిర్మాతల మధ్య ఉన్న సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి చర్చలతో పరిష్కారం లభించిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. మొత్తానికి ఈ సమస్య అయితే తీరింది. గత శుక్రవారం నుంచి షూటింగ్ లు మొదలయ్యాయి. సినీ కార్మికులు షూటింగ్స్కు హాజరవుతారని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. పర్సంటేజీ విషయంలో బాధగా ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తప్పట్లేదని అన్నారు.. ఈ ఆదివారం కొన్ని సినిమాల షూటింగ్ లు మొదలవ్వబోతున్నట్లు సమాచారం.

Related News

Kalyani Priyadarshan: కమిట్మెంట్ పై అలాంటి కామెంట్స్ చేసిన హీరోయిన్.. అందుకే జాగ్రత్త వహిస్తున్నానంటూ?

Film industry: షూటింగ్ సెట్ లో విషాదం..అసిస్టెంట్ డైరెక్టర్ కన్నుమూత!

Mahavathar Narasimha : ఈ వీకెండ్ కూడా యానిమేషన్ మూవీదే హవా.. అక్కడ కూలిపోయిన ‘కూలీ’..

Mass Jathara : మాస్ జాతర టీం కు లీగల్ నోటీసులు, నిర్మాత వంశీకి దెబ్బ మీద దెబ్బ

Sreeleela: శ్రీలీలా హీరోయిన్ అవ్వడం వెనక ఎన్టీఆర్, బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ చేసిన శ్రీలీలా మదర్

Big Stories

×