BigTV English

Samantha: క్రైమ్ థ్రిల్లర్ కథతో సమంత కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

Samantha: క్రైమ్ థ్రిల్లర్ కథతో సమంత కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఈ మధ్యకాలంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న ఈమె.. ఇటు తెలుగులో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచీ ఎటువంటి అప్డేట్ విడుదల చేయలేదు. దీనికి తోడు అటు బాలీవుడ్ లో ‘రక్త బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్టు ప్రకటించారు. అటు ఈ వెబ్ సీరీస్ కి సంబంధించిన అప్డేట్ కూడా లేకపోవడంతో అసలు సమంత సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్.


ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈమెకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 1980ల నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో సమంత ఒక సినిమా చేయబోతోందని, ఒక లేడీ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతోందని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే..’మా ఇంటి బంగారం’ సినిమాను ప్రకటించి, చాలా కాలం అయ్యింది. కానీ ఈ సినిమా షూటింగ్ విషయంలో ఇప్పటివరకు ఏ స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి (Nandini Reddy) తీసుకున్నట్లు సమాచారం.

క్రైమ్ థ్రిల్లర్ కథతో సమంత..


సమంత – నందినిరెడ్డి కాంబినేషన్లో ‘ఓ బేబీ’ సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ కొత్త చిత్రం గురించి అధికారిక ప్రకటన చేసి ఇద్దరు సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా రాబోతోందని.. సమంతను ఇందులో మునుపెన్నడూ చూడని పాత్రలో మనం చూడబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా యాక్షన్ కోణంలో ఈ సినిమా ఉంటుందని, గతంలో విడుదలైన టైటిల్ లుక్ తోనే స్పష్టత వచ్చేసింది. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా వెల్లడి కానున్నాయి. మొత్తానికి అయితే ఇప్పుడు సమంత చేయబోతున్న ఈ కొత్త సినిమాకు సంబంధించిన వార్తలు అభిమానులలో మరిన్ని అంచనాలు పెంచేసాయి.

సమంత కెరియర్..

సమంత విషయానికి వస్తే..’ఏ మాయ చేసావే’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత దూకుడు, అత్తారింటికి దారేది, బృందావనం, అల్లుడు శీను, రంగస్థలం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, ఈగ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.

సమంత వ్యక్తిగత జీవితం..

కెరియర్ పరంగా ఉన్నత స్థానాన్ని అందుకున్న సమంత.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అక్కినేని వారసుడు నాగచైతన్య (Naga Chaitanya) ను వివాహం చేసుకున్న నాలుగేళ్లకే విడాకులు తీసుకొని, ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. ఆ సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj nidimoru)తో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి సమంత ఈ రూమర్స్ కి చెక్ పెట్టి కెరియర్ పైన ఫోకస్ పెట్టాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:Singer Chitra: 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో చిత్రకి ఘోర అవమానం.. అసలేం జరిగిందంటే?

Related News

Actress Meena: గీతాంజలి సినిమా మీనా చేయాల్సిందా.. అలా మిస్ చేసుకుందా?

Nithiin: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ… అంతా తమ్ముడు ఎఫెక్ట్

Chiranjeevi: నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిసిన చిరంజీవి !

Sai Dharam Tej : అల్లు అర్జున్ గురించి సాయి తేజ్ లేటెస్ట్ కామెంట్స్, ఆయన ఇప్పుడు గొప్పోళ్ళు అయిపోయారు

Mowgli Release Date: మొగ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ , క్రేజీ వీడియో

K- Ramp Trailer delay : ఈ దర్శక నిర్మాతలు మారరా, ప్రేక్షకులతో ఆడుకోవడమే పని అయిపోయిందా

Silambarasan TR: ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ని పట్టుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఏకంగా శింబు తో సినిమా

‎Raviteja: ఆ డిజాస్టర్ సినిమాలంటే ఇష్టమన్న మాస్ హీరో..ఆ డౌట్ వస్తే సినిమా పోయినట్టేనా?

Big Stories

×