BigTV English

Medipally murder case: ముక్కలు చేసిన భర్త.. మేడిపల్లి స్వాతి హత్యపై డీసీపీ షాకింగ్ కామెంట్స్!

Medipally murder case: ముక్కలు చేసిన భర్త.. మేడిపల్లి స్వాతి హత్యపై డీసీపీ షాకింగ్ కామెంట్స్!

Medipally murder case: హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన మేడిపల్లి స్వాతి హత్య కేసు రోజురోజుకూ కొత్త కోణాలను బయటపెడుతోంది. మాల్కాజ్‌గిరి డీసీపీ పద్మజ వివరాల ప్రకారం, ఈ దారుణం ఒక క్షణిక కోపం ఫలితం కాకుండా, పూర్తిగా ప్లాన్ చేసి చేసిన క్రూరకార్యం. ఈ ఘటన మహిళల భద్రతపై మరలా ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, ప్రేమ వివాహాల వెనుక దాగి ఉన్న సమస్యలను కూడా వెలుగులోకి తెచ్చింది.


స్వాతి, మహేందర్ రెడ్డి ఇద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు. ప్రేమలో పడి పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లో తమ జీవితాన్ని సర్దుకుపోతున్నారు. మహేందర్ రెడ్డి రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, స్వాతి ఒక కాల్ సెంటర్‌లో జాబ్ చేస్తూ కుటుంబానికి తోడ్పడుతోంది. పెళ్లయి కొద్ది కాలంలోనే స్వాతి ప్రెగ్నెంట్ కావడంతో ఇరువురి జీవితాల్లో ఆనందం నిండాలని అనుకున్నారు. కానీ ఈ ఆనందం మహేందర్ అనుమానాలు, ఆవేశం కారణంగా క్షణాల్లో చీకటిలో మునిగిపోయింది.

స్వాతి మళ్ళీ ప్రెగ్నెంట్ కావడంతో అమ్మ ఇంటికి వెళ్ళాలని కోరింది. కానీ ఆ నిర్ణయాన్ని మహేందర్ అంగీకరించలేదు. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 22వ తేదీన మహేందర్ తనలోనే ఒక క్రూర నిర్ణయం తీసుకున్నాడు. ముందే యాక్స్ బ్లేడ్ కొనుక్కొని, దారుణానికి స్కెచ్ వేశాడు. అదే రోజున స్వాతి తన పుట్టింటి విషయంపై మరోసారి గొడవపడ్డ తర్వాత, మహేందర్ ఆమెను చితకబాది క్రూరంగా హత్య చేశాడు.


అంతే కాదు, హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాళ్లు, చేతులు, తలను వేరు చేసి చిన్న చిన్న కవర్స్‌లో మూసి 3 సార్లు వెళ్లి విభిన్న ప్రదేశాల్లో పారేసాడు. ఈ క్రూరత వివరాలు వినగానే సమాజం మొత్తం షాక్‌కు గురైంది. హత్య చేసిన తర్వాత కూడా తన నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ, తన చెల్లెలు చంద్రకళకు స్వాతి కనిపించడంలేదని అబద్ధం చెప్పాడు. చంద్రకళ భర్త గోవర్ధన్ రెడ్డికి అనుమానం రావడంతో, స్వాతి మిస్సింగ్ కేసు నమోదు చేయడానికి మహేందర్‌ను ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళాడు.

ఈ మిస్సింగ్ కేసు ఆధారంగా మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ఒక్కొక్క ఆధారంతో నిజం వెలుగులోకి వచ్చింది. విచారణలోనే మహేందర్ తన నేరాన్ని ఒప్పుకొని, స్వాతి మృతదేహం ఎక్కడ ఉందో చూపించాడు. పోలీసులు వెంటనే మహేందర్‌ను అదుపులోకి తీసుకొని, ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డీసీపీ పద్మజ మాట్లాడుతూ, ఈ కేసును ఫాస్ట్రాక్ కోర్ట్ ద్వారా వేగంగా దర్యాప్తు చేస్తాం. స్వాతి మృతదేహంలోని మిగిలిన భాగాలను కోసం శోధన కొనసాగుతోందని తెలిపారు.

Also Read: Bhadradri crime: యువతిపై సామూహిక అత్యాచారం.. భద్రాద్రి జిల్లాలో దారుణ ఘటన!

ఈ ఘటనతో మహిళా భద్రత మరోసారి చర్చకు వచ్చింది. ప్రేమలో పడిన జంటలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడులు, ఆవేశాలు ఇలాంటి భయంకర పరిణామాలకు దారి తీస్తున్నాయనే వాస్తవం వెలుగులోకి వస్తోంది. సమాజంలో మహిళల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల మాటల్లో, ఇంత క్రూరంగా ఒక గర్భిణిని హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేయడం ఊహించలేని విషయం. ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు తప్పనిసరి అంటున్నారు. నిందితుడు మహేందర్ రెడ్డికి వికారాబాద్‌లో ఇప్పటికే 498ఏ కేసు ఉండటం, అతని ఆగ్రహ స్వభావం ఈ దారుణానికి దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

స్వాతి హత్యతో చెలరేగిన ఆవేదన, ఆగ్రహం సమాజంలో మహిళల భద్రతపై మరింత కఠిన చట్టాలు అవసరమనే చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో వేగవంతమైన న్యాయం జరగాలని, నిందితుడు కఠిన శిక్షకు గురవ్వాలని స్వాతి కుటుంబం, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Related News

Bhadradri crime: యువతిపై సామూహిక అత్యాచారం.. భద్రాద్రి జిల్లాలో దారుణ ఘటన!

Rangareddy News: భార్య చెప్పడంతో సరే అన్నాడు.. ప్లాన్ చేసింది భార్య, సాయంత్రానికి

Electric Shock: దారుణం.. హైదరాబాద్‌లో కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం..

Greater Noida: భార్యని సజీవ దహనం చేసిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి ఘాతుకం, ఎక్కడ?

Medchal News: గర్భవతి భార్యని చంపిన భర్త.. శరీరాన్ని ముక్కలు చేసి మూసీలో, మేడ్చల్‌ జిల్లా దారుణం

Big Stories

×