E-Paper
Advertisement

Jagapathi Babu: అది తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నా..

Jagapathi Babu: అది తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నా..
Advertisement

Jagapathi Babu: జగపతి బాబు.. మహిళా అభిమానులు ఈ పేరు చెప్పగానే అప్పట్లో ఊగిపోయేవారు. జగపతి బాబు సినిమాకు తీసుకెళ్లకపోతే భర్తలకు అన్నాలు కూడా పెట్టేవారు కాదట. అంతలా లేడీ ఫ్యాన్ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో జగపతి బాబు ఒకడు. ఇక హీరోగా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించిన జగ్గూభాయ్.. విలన్ గా మారాడు.

డబ్బు సంపాదించడానికి ఏదైతే ఏం అనుకోని విలన్ గా రీఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు.. ఇప్పుడు స్టార్ విలన్ గా కొనసాగుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగపతి బాబు.. రేపు మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

Advertisement

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. జగ్గు భాయ్ కు సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏ ఫోటో పెట్టినా.. దానికి తెలుగులో చమత్కారంగా ఒక క్యాప్షన్ రాసుకొస్తాడు. ఆ క్యాప్షన్స్ కే చాలామంది అభిమానులు ఉన్నారు అంటే ఆశ్చర్యం లేదు. తాజాగా జగ్గు భాయ్ తన కొత్త ఫోటోను షేర్ చేస్తూ.. తనదైన రీతిలో అద్భుతమైన క్యాప్షన్ జోడించాడు.

బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, ఆ డ్రెస్ ను ఎలివేట్ చేసే సిల్వర్ చైన్స్.. నీట్ గా ఒక బ్యాగ్.. కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని.. అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. దీనికి క్యాప్షన్ గా ” వయస్సు పెరిగేకొద్దీ తగ్గించుకుందామనే ప్రయత్నంలో ఉన్నా.. మీకు ఓకేనా..? ” అని రాసుకొచ్చాడు. ఇక దీనికి ఫ్యాన్స్ తమదైన రీతిలో సమాధానాలు ఇస్తున్నారు. ఇప్పటికీ మీరు హీరోలని ఉన్నారు అని కొందరు.. ఇంకా పెంచు అందాన్ని అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు జగ్గూభాయ్.. కాలేజ్ కుర్రాడిలా మారిపోతాడేమో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×