E-Paper
Advertisement

Janhvi Kapoor: ఎన్టీఆర్‌తో సినిమా.. జాన్వీకపూర్‌ రియాక్షన్ ఇదే..

Janhvi Kapoor:  ఎన్టీఆర్‌తో సినిమా.. జాన్వీకపూర్‌ రియాక్షన్ ఇదే..
Advertisement

Janhvi Kapoor: ఎన్టీఆర్. మూడక్షరాల పవర్. తారక్ యాక్టింగ్ వేరే లెవెల్. ఎన్టీఆర్ ఎనర్జీ మరో లెవెల్. జూనియర్ సినిమాలు ఆపై లెవెల్. ఇప్పటికే RRRతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. హాలీవుడ్ సైతం కొమురంభీంను చూసి షాక్ అయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ మార్కెట్ తారాస్థాయికి చేరింది.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు. కొరటాల శివ డైరెక్టర్ కావడంతో మరింత ఆసక్తి. వీరిద్దరి కాంబినేషనే అదుర్స్ అనుకుంటుండగా.. హీరోయిన్‌గా జాన్వీకపూర్ ఎంపిక కావడం మరింత ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.

Advertisement

అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవిల కాంబినేషన్లో అనేక హిట్లు వచ్చాయి. కట్ చేస్తే, ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ మనువడు జూనియర్ ఎన్టీఆర్‌ సరసన శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటిస్తుండటంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు.

ఫ్యాన్స్ సంగతి సరే.. మరి జాన్వీకపూర్ రియాక్షన్ ఎలా ఉంది? ఎన్టీఆర్‌తో సినిమాపై జాన్వీ స్పందించారు. తారక్ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. ఆయనతో పనిచేసే ఛాన్స్‌ రావాలని ప్రతిరోజూ దేవుడిని కోరుకునేదాన్నని.. ఫైనల్‌గా అది నిజమైందని సంబరం వ్యక్తం చేశారు. సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నానని.. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని దర్శకుడు కొరటాల శివకి రోజూ మెసేజ్‌లు పెడుతున్నానని చెప్పారు జాన్వీకపూర్. ఇటీవలే మరోసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూశానని.. ఎన్టీఆర్ అందం, ఉత్సాహం.. మరోస్థాయిలో ఉంటాయని జాన్వీ అన్నారు.

Advertisement

జాన్వీకపూర్ ఎగ్జైట్‌మెంట్ చూస్తుంటే.. మొదటిరోజు షూటింగ్‌లో తనను తాను గిల్లుకొని చూసుకుంటారేమో.. ఇది నిజమో కాదోనని.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×