E-Paper
Advertisement

Jani Master: నోరు విప్పిన జానీ మాస్టర్.. ఆ డైరెక్టర్ ను మధ్యలోకి లాగుతూ..!

Jani Master: నోరు విప్పిన జానీ మాస్టర్.. ఆ డైరెక్టర్ ను మధ్యలోకి లాగుతూ..!
Advertisement

Jani Master.. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ (Jani Master) ప్రస్తుతం చంచల్గూడా జైల్లో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక మూడవరోజు పోలీస్ ఇంట్రాగేషన్ జరుగుతోంది. సీనియర్ లాయర్ సమక్షంలో జానీ మాస్టర్ పై పోలీస్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు ప్రయత్నిస్తుండగా.. బాధితురాలి నుంచి కూడా రెండు సార్లు స్టేట్మెంట్లను రికార్డు చేశారు. అయితే తాజాగా ఇంట్రాగేషన్ లో జానీ మాస్టర్ కీలక విషయాలను వెల్లడిస్తూ.. ఒక స్టార్ డైరెక్టర్ ను మధ్యలోకి లాగినట్లు తెలుస్తోంది. మరి ఇంట్రాగేషన్ లో జానీ మాస్టర్ ఏం చెప్పారు..? అసలు ఏం జరిగింది..? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ఇంట్రాగేషన్లో విస్తుపోయే నిజాలు బయటపెట్టిన జానీ మాస్టర్..

Advertisement

బాధితురాలు సమర్పించిన ఆధారాలను ముందు పెట్టి జానీ మాస్టర్ దగ్గర పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే జానీ మాస్టర్ మాత్రం బాధితురాలే తనను వేధించిందంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఢీ షో సమయంలో బాధిత యువతి తనకు తానుగా నాతో పరిచయం చేసుకుంది అంటూ పోలీసులకు తెలిపారు. జానీ మాస్టర్ ఇంట్రాగేషన్ లో మాట్లాడుతూ.. నేను బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడే ఆమెపై లైంగిక దాడి చేశానంటూ ఆరోపణలు చేస్తోంది. అది పచ్చి అబద్ధం. అసలు నేను ఆమెపై లైంగిక వేధింపులకు ఎప్పుడూ పాల్పడలేదు. అవన్నీ నిరాధారమైనవి. కేవలం ఆ అమ్మాయి టాలెంట్ ను గుర్తించి మాత్రమే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాను. అయితే ఆమె నాతో పెళ్లి చేసుకోవాలని నన్ను హింసించేది. ఈ విషయంలో చాలాసార్లు నాపై బెదిరింపులకు పాల్పడింది అంటూ పోలీస్ విచారణలో జానీ మాస్టర్ వెల్లడించారు.

ఇబ్బంది పడిన ప్రతిసారీ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లా..

Advertisement

అయితే ఈ విషయంలో తాన పడుతున్న ఇబ్బందిని ప్రతిసారీ కూడా డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లానని , సుకుమార్ పిలిచి మాట్లాడినా సరే ఆమె తీరులో మార్పు రాలేదని, తనపై కుట్ర జరిగిందని ,వెనుక ఉండి తనకు వ్యతిరేకంగా కుట్ర చేయిస్తున్నారని, తన ఎదుగుదల చూసి ఓర్వలేకే ఈ కేసులో తనను కావాలని ఇరికించారంటూ పోలీసులతో చెప్పుకొచ్చారు జానీ మాస్టర్. ఇదిలా ఉండగా శనివారం నాటితో రంగారెడ్డి జిల్లా ప్రత్యేక హోదా కోర్టు అనుమతించిన నాలుగు రోజులు పోలీస్ కస్టడీ ముగియబోతోంది. శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయన దగ్గర పోలీసులు విచారణ కొనసాగించి, అనంతరం రంగారెడ్డి జిల్లా ప్రత్యేక హోదా కోర్టులో జానీ మాస్టర్ ను పోలీసులు హాజరు పరిచబోతున్నారు. ఇక జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ సోమవారానికి వాయిదా పడినట్లు సమాచారం. ఇకపోతే జానీ మాస్టర్ ను మైనర్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అన్న కారణముతో ఈనెల 19వ తేదీన పోక్సో చట్టం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరి ఏది నిజం? ఏది అబద్దం? ఎవరు నిజం? ఎవరు అబద్ధం? తెలియాలి అంటే విచారణ పూర్తయిన తర్వాత కోర్టు ఇచ్చే తీర్పును బట్టి అసలు నిజం బయటపడుతుందని చెప్పవచ్చు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×