BigTV English

Jr Ntr:- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ని క‌లిసిన తెలంగాణ మంత్రి

Jr Ntr:- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ని క‌లిసిన తెలంగాణ మంత్రి


Jr Ntr:- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ప్ర‌త్యేకంగా బేటీ కావ‌టం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అస‌లు ఇంత‌కీ ఆయ‌న ఎందుకు ఎన్టీఆర్‌ను క‌లిశార‌నే వివ‌రాల్లోకి వెళితే, మే 28న ఖ‌మ్మంలోని ల‌కారం ట్యాంక్ బండ్‌పై స్వ‌ర్గీయ సీనియ‌ర్ ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌టానికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించ‌టానికి మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్ విచ్చేయ‌టం విశేషం. ఇప్ప‌టికే విగ్ర‌హాన్ని త‌యారు చేయ‌ట‌మే కాకుండా ఖ‌మ్మంకు త‌ర‌లించారు.

మొత్తంగా 54 అడుగులు ఉండే ఈ విగ్ర‌హంలో త‌ల భాగం 5 అడుగులు, కాళ్ల భాగం 5 అడుగులుగా ఉండ‌నున్నాయి. మిగిలిన విగ్ర‌హమంతా 44 అడుగులు ఉంటుంది. పొలిటీషియ‌న్ లుక్‌లో కాకుండా ఎన్టీఆర్ ఆరాధ్య రూప‌మైన శ్రీకృష్ణుని గెట‌ప్‌లో ఎన్టీఆర్ అభిమానుల‌ను, ప్ర‌జ‌ల‌ను అల‌రించ‌నున్నారు. మే 28న భారీ ఎత్తున ఖ‌మ్మంలో ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించనున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీ సంఖ్య‌లో భారీ ఎత్తున అభిమానులు రాబోతున్నారు. 36 అడుగులు వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీరంలో విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు.


ఈ భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌టానికి మంత్రి పువ్వాడ‌ అజ‌య్ కుమార్ ప్ర‌త్యేకమైన చొర‌వ చూపారు. విగ్ర‌హాన్ని తయారు చేయ‌టానికి దాదాపు రెండున్న‌ర కోట్ల రూపాయ‌లు ఖర్చు అయ్యాయి. ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మ‌య్యే నిధుల‌ను మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌, తానా స‌భ్యులు, ఇత‌ర బిజినెస్ మేన్స్‌తో క‌లిసి స‌మ‌కూర్చారు. తెలంగాణ మంత్రి అయిన‌ప్ప‌టికీ ముందుండి అంతా తానై ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన అజ‌య్ కుమార్‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌, అభిమానులు అభినందిస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×