E-Paper
Advertisement

Ka Movie Collections : కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘క ‘ మూవీ.. ఆరు రోజులకు ఎన్ని కోట్లంటే..?

Ka Movie Collections : కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘క ‘ మూవీ.. ఆరు రోజులకు ఎన్ని కోట్లంటే..?
Advertisement

KaKa Movie Collections : తెలుగు ఇండస్ట్రీలో కొందరి హీరోలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారికంటే సామాన్యుడుగా వచ్చిన హీరోల హవా ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉంటుంది. ఈ మధ్య ఆ హీరోల సినిమాలే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో పాటుగా బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ ను కూడా దోచుకుంటున్నాయి.. ఈ దీపావళి పండగకు అన్ని చిన్న సినిమాలే విడుదల అయ్యాయి. కానీ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. ఈ దీపావళి రేసులో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘ క ‘ మూవీ కూడా ఉంది. ఆ మూవీ మొదట యావరేజ్ టాక్ ను అందుకున్నా కూడా ఇప్పుడిప్పుడే కలెక్షన్స్ పెరుగుతున్నాయి. 5 రోజులకు భారీగా వసూల్ చేసిన క.. ఆరో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. ఇక ఆలస్యం ఎందుకు ఆరు రోజులకు క మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం..

ఇక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దర్శక ద్వయం సుజీత్,సందీప్ లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు.. అక్టోబర్ 31 న దీపావళి కానుకగా థియేటర్లలోకి విడుదల అయ్యింది. మొదట పర్వాలేదనిపించిన మూవీ ఇప్పుడు దూసుకుపోతుంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్ లో వరుస వైఫల్యలతో ఇబ్బంది పడుతున్న సమయంతో ఆయనకు కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది క మూవీ.. మొదటి రోజు నుంచి కలెక్షన్స్ బాగానే వసూల్ చెస్తుంది. టాక్ తో సంబంధం లేకుండా వసూల్ చేస్తుంది. ఇక క మూవీ ఏ రోజు ఎంత రాబాట్టిందో ఒకసారి తెలుసుకుందాం..

Advertisement

కిరణ్ అబ్బవరం ‘క’మూవీ తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ రూ. 3.8 కోట్ల కలెక్ట్ చేసింది. మొదటి రోజు ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని క మూవీ మొత్తం రూ.6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో రోజు రూ.3 కోట్లు రాబట్టగా .. ఇక వీకెండ్ కావడంతో కుమ్మేసింది. ‘క’మూవీ 3వ రోజు కలెక్షన్ భారీగా పెరిగాయి. ఎవరూ ఊహించని విధంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3.75 కోట్లు కలెక్ట్ చేసింది.. నాలుగో రోజు కూడా సేమ్ రాబట్టింది. ఇక ఐదో రోజు సోమవారం కాస్త కలెక్షన్స్ తగ్గాయి. 1.60 కోట్లు రాబట్టింది. దాదాపు 60 శాతం కలెక్షన్లో డ్రాప్ కనిపించింది. ఇక ‘క’ మూవీ డే 6 కలెక్షన్లను పరిశీలిస్తే.. క్రమంగా వసూలు తగ్గుతున్నాయి. క మూవీ మంగళవారం నాడు రూ. 1.50 కోట్లు నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల తెలిపాయి. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క మూవీ మొత్తం రూ. 17.15 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆరు రోజులకు గాను ఈ మూవీ రూ. 36 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు తెలుస్తుంది.. ఇక ఓటిటి పార్ట్నర్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. ఈ వీకెండ్ వరకు రూ. 50 కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రెడ్ వర్గాల అంచనాఅక్కడ స్ట్రీమింగ్ అయ్యేవరకు ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×